- కర్వ్ ఈవీతో పాటుగా క్రాష్ టెస్ట్ లో పాల్గొన్న కర్వ్
- జిఎన్ క్యాప్ టెస్టింగ్లో కూడా 5- స్టార్ రేటింగ్ ని స్కోర్ చేసినకర్వ్ మరియు కర్వ్ ఈవీ
జిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లలో దాని సత్తాను నిరూపించుకున్న తర్వాత, టాటా నెక్సాన్ స్థానికంగా ఉత్పత్తి చేయబడిబిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లలో కూడా ఇదే విధమైన ఫీట్‌ను సాధించింది. కర్వ్ మరియు కర్వ్ ఈవీతో పాటుగా ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ కారుపై కూడా భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ నిర్వహించబడింది మరియు టాటా నుంచి వచ్చిన ఈ మూడు ఎస్‌యూవీలు 5- స్టార్ రేటింగ్ తో టెస్ట్‌లలో రాణించాయి.
ఈ టెస్ట్‌లు ఫియర్‌లెస్ వేరియంట్ పై నిర్వహించారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కానీ నిబంధనల ప్రకారం చూస్తే, ఈ రేటింగ్‌లు నెక్సాన్ లో ఉన్న అన్ని వేరియంట్‌లకు వర్తిస్తాయి. అలాగే, పాపులర్ ఎస్‌యూవీ అడల్ట్సేఫ్టీ రేటింగ్స్ లో 32 పాయింట్లకు 29.41 పాయింట్లనుస్కోర్ చేసింది. మరోవైపు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ రేటింగ్ లో 49పాయింట్లకు 43.83 పాయింట్లను స్కోర్ చేయగలిగింది.
ఇక ఓవరాల్ రిజల్ట్స్ విషయానికొస్తే, అన్ని సేఫ్టీఇండివిజువల్ టెస్ట్‌లు మరియు సేఫ్టీప్రమాణాలను కోసం ఎక్కువగా 'తగినంత' మరియు 'మంచి' రేటింగ్‌లను పొందడం ద్వారా నెక్సాన్ చాలా బాగా పనిచేసినట్లు మొత్తం ఫలితం ద్వారా అర్థమవుతుంది.
ఇతర వార్తలలో చూస్తే, ఆటోమేకర్ ఇటీవలే నెక్సాన్ సిఎన్‍జి వెర్షన్ ని రూ. 8.99 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అలాగే, మేము సిటీ మరియు హైవే రోడ్డుపై కూడా నెక్సాన్ సిఎన్‍జి వేరియంట్ ను రియల్ వరల్డ్ మైలేజ్ రేంజ్ కోసం టెస్ట్ చేశాము.
అనువాదించిన వారు: రాజపుష్ప