- మరికొన్ని నెలల్లో రానున్న నెక్సాన్ ఐసిఎన్‍జి
- ఇండియాలో సిఎన్‍జి ఫిట్టింగ్‌తో అందించబడనున్న మొట్టమొదటి టర్బో-పెట్రోల్ కారు ఇదే
టాటా మోటార్స్ తన సిఎన్‍జిలైనప్ ద్వారా ఇండియన్ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తన కృషిని కొనసాగిస్తుంది. ఇండియన్ ఆటోమేకర్ అయిన టాటా మోటార్స్ తాజాగా దేశంలో మొట్టమొదటి సిఎన్‍జిఆటోమేటిక్ కార్లు టియాగోమరియు టిగోర్బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు, టాటా కంపెనీ తన ప్రముఖ మోడల్ నెక్సాన్ యొక్క సిఎన్‍జికాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ షోలో టాటా నెక్సాన్ ఐసిఎన్‍జికాన్సెప్ట్‌ను ప్రదర్శించింది.
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత,టాటా నెక్సాన్ సిఎన్‌జి కొత్త ఫీచర్లతో మరియు మొట్టమొదటి టర్బో-పెట్రోల్ పవర్డ్ సిఎన్‌జి కారుగా నెక్సాన్ నిలిచిపోనుంది. ఈ మోడల్ కంపెనీ సిగ్నేచర్ ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో రానుంది, ఇది 60-లీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకునే కెపాసిటీని కలిగి ఉండనుంది.
త్వరలోనే సిఎన్‌జి స్థానాన్ని భర్తీ చేయనున్న నెక్సాన్ ఐసిఎన్‍జి
ఈ కొత్త సిఎన్‌జికారులో సుమారుగా 230 లీటర్ల బూట్‌స్పేస్ ఉండనుంది మరియు ఇందులో అడ్వాన్స్డ్ ఈసీయూ, సిఎన్‌జిలో డైరెక్ట్ స్టార్టింగ్ ఫంక్షన్, రెండు ఫ్యూయల్స్ మధ్య ఆటోమేటిక్ స్విచింగ్ ఫంక్షన్, మాడ్యులర్ ఫ్యూయల్ ఫిల్టర్ కూడా ఉండనుంది. ఎన్‌జివి1 యొక్క యూనివర్సల్ టైప్ నాజిల్, కొత్త సిఎన్‌జికారులో త్వరగా గ్యాస్‌ను నింపే కెపాసిటీ కలిగిన ఫీచర్లతో వస్తుందని కంపెనీ పేర్కొంది.
నెక్సాన్ సిఎన్‌జికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్లను టాటా కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దీని పెట్రోల్ వెర్షన్ 1.2-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 118bhp పవర్ మరియు 170Nm టార్క్ ఉత్పత్తి చేయనుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో జత చేయబడింది. లాంచ్ అయిన తర్వాత, టాటా నెక్సాన్ ఐసిఎన్‍జి మారుతి బ్రెజా సిఎన్‌జితో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్