- 2017లో ఇండియాలో లాంక్ అయిన నెక్సాన్
- 2023లో మేజర్ ఫేస్‌లిఫ్ట్ ని అందుకున్న టాటా మోడల్
2017లో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడు లక్షల నెక్సాన్ యూనిట్లను విక్రయించిన సందర్భంగా టాటా కంపెనీ నెక్సాన్ పై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ ని అందిస్తోంది. మీరు నంబర్ల పరంగా చూస్తే, ఇప్పటి వరకు టాటా నుంచి రిలీజ్ అయిన ఇండికా, సుమో మరియు సఫారీ కార్లను అధిగమించి మోస్ట్ సక్సెస్ ఫుల్ గా నిలిచిన కారు ఇదే. ఈ కార్లన్నీ చాలా కాలం పాటు సేల్స్ ని కొనసాగించాయి.
అతిపెద్ద న్యూస్ ఏమిటంటే, నెక్సాన్ కారును బుక్ చేసుకున్న వారితో పాటుగా కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా కంపెనీ లక్ష రూపాయల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లు వేరియంట్ ని బట్టి మారుతూ ఉండగా, జూన్ 30 వరకు మాత్రమే అమలులో ఉంటాయి. ఇంకో హైలైట్ విషయం ఏంటి అంటే, నెక్సాన్ మోడల్ రూ. 10 లక్షల ధర వ్యవధిలో దాదాపు 99 వేరియంట్‌లను కలిగి ఉంది. ఇది ఓ రకంగా కస్టమర్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
టాటా కంపెనీ సెప్టెంబరు 2023లో నెక్సాన్‌కు అత్యంత ముఖ్యమైన అప్ డేట్ ని అందించింది, వీటిలో అప్ డేటెడ్ ఎక్స్‌టీరియర్ డిజైన్, ఫీచర్ లిస్టు మరియు డిసిటితో కూడిన కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్ వంటివి ఉన్నాయి. గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో నెక్సాన్ మోడల్ 5-స్టార్ రేటింగ్ స్కోర్ చేయగా, లేటెస్టుగా నెక్సాన్ ఈవీ కారు భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో రేటింగ్‌ను స్కోర్ చేసింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్