టాటా మోటార్స్ 14 సెప్టెంబర్ 2023న ఇండియాలో సరికొత్త నెక్సాన్ ఎస్‍యువి ఫేస్ లిఫ్ట్నువిడుదల చేసింది. 5-సీట్స్ ఎస్‍యువి ప్రారంభ ధర రూ. 8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు టాప్-స్పెసిఫికేషన్ వేరియంట్ ధర రూ. 13 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ అప్‍డేట్ లో, మ్యానుఫాక్చరర్ పవర్‌ట్రెయిన్‌ను మార్చలేదు. కానీ, రెండు కొత్త గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఇందులో జత చేశారు. అవి ఏంటి అంటే 5-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటియూనిట్. ఈ ఆర్టికల్ లో, నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ దానికి పోటీగా ఉన్న మారుతి సుజుకి బ్రెజ్జా మరియు కియా సోనెట్‌ల ఫ్యూయల్ ఎఫిషియన్సీని సరిపోల్చబోతున్నాము.
టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్
2023 టాటా నెక్సాన్‌ను మనం 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ అనే 2 పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో పొందవచ్చు. ఇంతకు ముందున్నది 118bhp మరియు 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. అలాగే, ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఏఎంటీమరియు కొత్తగా పరిచయం చేసిన 7-స్పీడ్ డిసిటిగేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. అదే సమయంలో, ఆయిల్ బర్నర్ బెల్ట్ 113bhp మరియు 260Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఏఎంటీయూనిట్‌తో జతచేయబడింది. పవర్‌ట్రెయిన్ వారీగా ఏఆర్ఏఐ ద్వారా వెరిఫై చేయబడిన కొత్త నెక్సాన్ మైలేజ్ క్రింద ఇవ్వబడింది.
ఇంజిన్ | గేర్ బాక్స్ | ఫ్యూయల్ ఎఫిషియన్సీ |
1.2-లీటర్ టర్బో పెట్రోల్ | 5/6-స్పీడ్ మాన్యువల్ | 17.44కెఎంపిఎల్ |
6-స్పీడ్ఏఎంటీ | 17.18కెఎంపిఎల్ | |
7-స్పీడ్ డిసిటి | 17.01కెఎంపిఎల్ | |
1.5-లీటర్ డీజిల్ | 6- స్పీడ్ మాన్యువల్ | 23.23కెఎంపిఎల్ |
6-స్పీడ్ ఏఎంటీ | 24.08కెఎంపిఎల్ |
మారుతి సుజుకి బ్రెజా
ఈ లిస్టులో తర్వాతి స్థానంలో మారుతి సుజుకి బ్రెజా ఉంది. ఇప్పుడు మనం బ్రెజా మైలేజ్ మరియు ఇంజిన్ గురించి తెలుసుకుందాం. ఈ ఎస్‍యువి 103bhp మరియు 138Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ గ్యాసోలిన్ ఇంజన్‌తో వస్తుంది. ట్రాన్స్ మిషన్ విధులు నిర్వహించడానికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉన్నాయి. ఇందులో గుర్తించాల్సిన మరో అంశం ఏంటి అంటే, రెండోది మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. మాన్యువల్ వేరియంట్స్ ను పోల్చి చూస్తే మెరుగైన మైలేజ్ మనకు ఇందులో లభిస్తుంది. మారుతి బ్రెజా మైలేజ్ వివరాలు మనం కింద ఉన్న టేబుల్ లో చూడవచ్చు.
గేర్ బాక్స్ | ఫ్యూయల్ ఎఫిషియన్సీ |
మాన్యువల్ | 17.38కెఎంపిఎల్ |
ఆటోమేటిక్ | 19.80కెఎంపిఎల్ |
కియా సోనెట్
సౌత్ కొరియన్ అటోమేకర్, కియా 1.2 లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ఇంజిన్ ఆప్షన్స్ తో కియా సోనెట్ ను తీసుకువచ్చింది. గ్యాసోలిన్ మిల్స్ తో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ఐఎంటీ, 7-స్పీడ్ డిసిటి యూనిట్స్ ఉన్నాయి. వేరే వాటిలో చూస్తే, ఆయిల్ బర్నర్ కేటగిరీలో 6- స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉన్నాయి. మొత్తానికి వివిధ ఇంజిన్స్ ప్రకారం ఎస్‍యువి మైలేజ్ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | ఫ్యూయల్ ఎఫిషియన్సీ |
1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ | 5-స్పీడ్ మాన్యువల్ | 18.4కెఎంపిఎల్ |
1.0-లీటర్ టర్బో-పెట్రోల్ | 6-స్పీడ్ఐఎంటీ | 18.2కెఎంపిఎల్ |
7-స్పీడ్ డిసిటి | 18.3కెఎంపిఎల్ | |
1.5-లీటర్ డీజిల్ | 6- స్పీడ్ మాన్యువల్ | 24.1కెఎంపిఎల్ |
6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ | 19కెఎంపిఎల్ |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్