టాటా నెక్సాన్ ఈవీ మరియు ఇటీవల లాంచ్ అయిన మహీంద్రా ఎక్స్‌యువి400 ప్రో అనే వేరియంట్ ఇండియాలో వారివారి సెగ్మెంట్‌లో మాత్రమే పోటీగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏమి అందుబాటులో ఉన్నాయో మరియు వీటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయాలు మీకు ఇప్పటికే వివరించాము, అలాగే, ఈ రెండింటి రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ గురించి కూడా తెలుసుకోడానికి ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.
ఈరియల్ వరల్డ్ రేంజ్ పోలికలో ఒకదానితో ఒకటి పోటీగా ఉన్నవి ఏవి అంటే టాటా నెక్సాన్ ఈవీ లాంగ్-రేంజ్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి400 EL ప్రో వేరియంట్. టాటా నెక్సాన్ ఈవీ 40.5kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉండగా, మహీంద్రా ఎక్స్‌యువి400 EL ప్రో 39.5kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఈ రెండూ వరుసగా 465కిమీ మరియు 456కిమీ వరకు క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్నాయి.
స్పెసిఫికేషన్స్ | టాటా నెక్సాన్ ఈవీ లాంగ్-రేంజ్ | మహీంద్రా ఎక్స్‌యువి400 EL ప్రో |
బ్యాటరీ ప్యాక్ | 40.5kWh | 39.5kWh |
క్లెయిమ్డ్ రేంజ్ | 465కిమీ | 456కిమీ |
రియల్ వరల్డ్ రేంజ్ | 296కిమీ | 256కిమీ |
పవర్ అవుట్‌పుట్ | 143bhp/215Nm | 148bhp/310Nm |
డ్రైవింగ్ మోడ్స్ | సిటీ, స్పోర్ట్ మరియుఎకో | ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్లెస్ |
ఈ రెండు ఎస్‌యువిలలో రియల్ వరల్డ్ రేంజ్ ని పోల్చి చూసేందుకుమేము ఎన్నుకున్న మార్గంలో మోడరేట్ నుండి భారీ సిటీ ట్రాఫిక్‌లో ఈ కార్ల బ్యాటరీలు పూర్తిగా ఖాళీ అయ్యే వరకు కొంతమేరకు హైవే రన్‌లపై డ్రైవ్ చేశాము. నెక్సాన్ ఈవీ 296కిమీ తర్వాత ఆగిపోగా, మరోవైపు, మహీంద్రా ఎక్స్‌యువి400 ప్రో ఒక్కసారి, పూర్తిగా ఛార్జ్ చేసిన బ్యాటరీపై 256కిమీల దూరాన్ని కవర్ చేసింది.
అనువాదించిన వారు: రాజపుష్ప