- భారత్ ఎన్ క్యాప్ ద్వారా టెస్టింగ్ చేయబడిన టాటా నుంచి నాలుగవ మోడల్
- బిఎన్ క్యాప్ సేఫ్టీ రేటింగ్ లో పంచ్ ఈవీకి కూడా లభించిన 5-స్టార్ రేటింగ్
భారత్ ఎన్ క్యాప్ ద్వారా టాటా నెక్సాన్ ఈవీపై క్రాష్ టెస్టు నిర్వహించగా అందులో ఈ మోడల్ 5-స్టార్ రేటింగ్ ని స్కోర్ చేసింది. స్వదేశంలో జరిగిన క్రాష్ టెస్టులో హారియర్, సఫారీ, పంచ్ ఈవీలపై క్రాష్ టెస్టింగ్ నిర్వహించగా, ఇప్పుడు నాలుగవ మోడల్ గా నెక్సాన్ ఈవీ వాటి సరసన చేరింది.
అడల్ట్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్టులో భాగంగా, నెక్సాన్ ఈవీ 32 పాయింట్లకు గాను 29.86 పాయింట్లు స్కోర్ చేసింది. సేఫ్టీ పరంగా, ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ లోపల 6 ఎయిర్ బ్యాగ్స్, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్, మరియు ఫ్రంట్ సీట్లకు లోడ్ లిమిటర్స్ తో పాటుగా ప్రీ-టెన్షనర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇంకా చైల్డ్ ఆక్యుపెంట్ క్రాష్ టెస్టులో భాగంగా. నెక్సాన్ ఈవీ 49 పాయింట్లకు గాను 44.95 పాయింట్లు స్కోర్ చేసింది. రియర్ సీట్లకు చైల్డ్ సీట్ యాంకరేజెస్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్లకు మాన్యువల్ ఎయిర్ బ్యాగ్ కట్-ఆఫ్ స్విచ్ వంటి సేఫ్టీ ఫీచర్లతో నెక్సాన్ వచ్చింది. అన్ని మోడల్స్ మాదిరిగానే నెక్సాన్ మోడల్ కూడా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‍సీ) ఫీచర్ ని స్టాండర్డ్ గా పొందింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్