- బ్లాక్ మరియు రెడ్ యాక్సెంట్స్ ను పొందిన మోడల్
- కొత్త 45 వేరియంట్‌లో లభ్యం
టాటా మోటార్స్ ఈ పండుగ సీజన్‌కు ముందే నెక్సాన్ ఈవీ స్పెషల్ ఎడిషన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అలాగే, కార్‌మేకర్ ఈ సంవత్సరం ప్రారంభంలో 2024 భారత్ మొబిలిటీ షోలో సఫారి డార్క్ ఎడిషన్‌తో పాటు నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ ను కూడా ప్రదర్శించింది. అయితే, ఇప్పుడు లాంచ్ అయిన ఈ కారు పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో కొత్త నెక్సాన్ ఈవీ 45 వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యువి టాప్ హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి.
బ్లాక్ కలర్ తో పూర్తి చేయబడిన ఎక్స్‌టీరియర్
నెక్సాన్ ఈవీ డార్క్ కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్, పియానో బ్లాక్ లోయర్ గ్రిల్ మరియు చార్‌కోల్ గ్రే రూఫ్ రెయిల్స్తో పూర్తిగా బ్లాక్ కలర్ ను కలిగి ఉంది. అలాగే, 2D లోగో కూడా పియానో బ్లాక్ కలర్ లో ఉంది. ఈ ఎస్‌యువి 16-ఇంచ్ బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్‌పై రైడ్ చేస్తుంది.
రెడ్ ఇంటీరియర్ యాక్సెంట్స్
నెక్సాన్ ఈవీ డార్క్ లోపలి భాగంలో పూర్తిగా బ్లాక్ కలర్ ను పొందినప్పటికీ, ఇంటీరియర్ రెడ్ యూఐ మరియు యూఎక్స్ స్క్రీన్‌ల వంటి కాంట్రాస్ట్ రెడ్ ఎలిమెంట్‌లను పొందుతుంది. ఇది డాష్‌బోర్డ్‌లో రెడ్ డార్క్ డబుల్ డెకో స్టిచ్‌ను కూడా కలిగి ఉంది.
రెడ్ సీట్స్
అంతేకాకుండా, ఎస్‌యువి క్యాబిన్ సీట్స్ కోసం రెడ్ కలర్ అప్హోల్స్టరీని పొందడంతో పాటు డార్క్ క్యాబిన్ లోపల స్పంక్‌ను కూడా పొందింది.
స్పెషల్ 'డార్క్' బ్యాడ్జ్‌స్
చుట్టు బ్లాక్ కలర్, ఫెండర్ మరియు సీట్స్ పై '#డార్క్' బ్యాడ్జ్‌స్ ఉన్నాయి.
వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్
ఈ కారులో ప్రతేకమైనవి 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కాకుండా, వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, ప్రత్యేకంగా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్ ధర దీని ఆధారితమైన టాప్-స్పెక్ ఎంపవర్డ్+ 45 వేరియంట్ ధర కంటే రూ.20,000 ఎక్కువ ఉంది.
పవర్‌ట్రెయిన్
భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించబడిన కారు ఆధారంగా వచ్చిన మరొక ఈవీ కార్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా, ఇది 40.5kWh బ్యాటరీ మరియు 143bhp ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా కొత్త నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ 45kWh బ్యాటరీ ప్యాక్‌ను మరియు 465km నుండి 489km రేంజ్ ని స్టాండర్డ్ గా పొందుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప