- నెక్సాన్ ఈవీ మరియు టియాగో ఈవీలపై భారీగా తగ్గిన ధర
- ఎలాంటి మార్పులు లేని పంచ్ ఈవీ ధరలు
టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టియాగో ఈవీ మరియు నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించగా, ఇవి తక్షణమే అములులోకి రానున్నాయి. కంపెనీ ప్రకారం, బ్యాటరీ ధరలు తగ్గడంతో కస్టమర్లకు ఈ బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
నెక్సాన్ ఈవీ ధరలు రూ. 1.20 లక్షలు తగ్గడంతో, ఫలితంగా దీని మీడియం రేంజ్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 14.49 లక్షలు ఉండగా, లాంగ్ రేంజ్ వెర్షన్ ధర రూ.16.99 లక్షలతో (ఎక్స్-షోరూం) ప్రారంభమైంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కార్ మేకర్ ఈ ఎలక్ట్రిక్ సబ్-4-మీటర్ యొక్క అప్‍డేటెడ్ వేరియంట్-వారీ ధరలను ఇంకా వెల్లడించలేదు. ఇంకా చెప్పాలంటే, బ్రాండ్ ముందే పేర్కొన్నట్లుగా పంచ్ ఈవీ ధరలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కానీ, భవిష్యత్తులో బ్యాటరీ ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ సందర్భంగా టీపీఈఎంచీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ, “ఈవీయొక్క మొత్తం ధరలో బ్యాటరీ ఖర్చులు అధిక భాగాన్ని కలిగి ఉంటాయి. బ్యాటరీ సెల్ ధరలు ఇటీవలి కాలంలో తగ్గడంతో, మరియు భవిష్యత్తులో వాటి పొటెన్షియల్ తగ్గింపును దృష్టిలో ఉంచుకొని, వాటి బెనిఫిట్స్ ని నేరుగా కస్టమర్‌లకు అందించాలని మేము భావించాము. అందుబాటులో చవకగా ఉన్న ధరలతోఅత్యధికంగా అమ్ముడవుతున్న నెక్సాన్ ఈవీమరియు టియాగో ఈవీలపై ఎక్కువ మంది కస్టమర్లు ఆకర్షితులవుతున్నారు. ఇది మాకు మరింత బలాన్ని చేకూరుస్తాయని మేము విశ్వసిస్తున్నాము.” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్