- రూ.1.20 లక్షల వరకు తగ్గిన ధరలు
- 465 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తున్న నెక్సాన్ ఈవీ
కొన్ని రోజుల క్రితం, టాటా మోటార్స్ దాని ఎలక్ట్రిక్ వెహికిల్స్ యొక్క ధరలను తగ్గించింది, అందులో నెక్సాన్ ఈవీ మరియు టియాగో ఈవీ ఉన్నాయి. టియాగో ఈవీపై సుమారు రూ.70,000 వరకు ధర తగ్గించబడగా, నెక్సాన్ ఈవీపై భారీగా రూ. 1.20 లక్షల వరకు ధరలు తగ్గించబడ్డాయి. ఈ ఆర్టికల్ లో మనం ఇండియాలోని టాప్ -10 సిటీల్లో నెక్సాన్ ఈవీ యొక్క అప్‍డేటెడ్ వేరియంట్-వారీగా ఆన్-రోడ్ ధరలను తెలుసుకుందాం.
సిటీ | బేస్ వేరియంట్ | టాప్ వేరియంట్ |
ముంబై | రూ. 15.33 లక్షలు | రూ. 20.46 లక్షలు |
ఢిల్లీ | రూ. 15.36 లక్షలు | రూ. 20.50 లక్షలు |
చెన్నై | రూ. 15.51 లక్షలు | రూ. 20.53 లక్షలు |
కోల్ కతా | రూ. 15.32 లక్షలు | రూ. 20.46 లక్షలు |
బెంగళూరు | రూ. 15.33 లక్షలు | రూ. 20.47 లక్షలు |
హైదరాబాద్ | రూ. 17.35 లక్షలు | రూ. 23.16 లక్షలు |
అహ్మదాబాద్ | రూ. 16.19 లక్షలు | రూ. 21.61 లక్షలు |
పూణే | రూ. 15.33 లక్షలు | రూ. 20.46 లక్షలు |
చండీగర్ | రూ. 16.60 లక్షలు | రూ. 20.44 లక్షలు |
కొచ్చి | రూ. 15.89 లక్షలు | రూ. 20.44 లక్షలు |
ఇతర వార్తలలో చూస్తే, తాజాగా నెక్సాన్ కు గ్లోబల్ ఎన్ క్యాప్ సేఫ్టీ టెస్టులో 5-స్టార్ రేటింగ్ లభించింది. హ్యుందాయ్ వెన్యూతో పోటీపడుతున్న టాటా నెక్సాన్ మోడల్ అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ లో వరుసగా 34 పాయింట్లకు గాను 32.22 పాయింట్లు మరియు 49 పాయింట్లకు గాను 44.52 పాయింట్లు పొందింది. గమనించాల్సిన విషయం ఏంటి అంటే, గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్టులో టాటా సఫారీ మరియు హారియర్ ఫేస్‍లిఫ్ట్ మోడల్స్ తర్వాత ఇప్పుడు నెక్సాన్ రెండవ అత్యధిక స్కోరును సాధించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్