- ఇండియాలో రూ. 14.74లక్షలతో ప్రారంభంకానున్న నెక్సాన్ ఈవీ ధరలు
- 31 డిసెంబర్ వరకే అందుబాటులో ఉండనున్న డిస్కౌంట్స్
కొన్ని సెలెక్ట్ టాటా మోటార్స్ డీలర్షిప్స్ ఈ నెలలో నెక్సాన్ ఈవీపై భారీగా డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ బెనిఫిట్స్ మరియు క్యాష్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో కొత్త మోడల్ పై మరియు ఇంతకు ముందు జనరేషన్ వేరియంట్స్ అయిన మ్యాక్స్ మరియు ప్రైమ్ పై అందుబాటులో ఉన్నాయి.
ప్రీ-ఫేస్‌లిఫ్ట్ టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌పై సుమారుగా రూ. 2.20 లక్షల క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. ఇంతకు ముందు జనరేషన్ మోడల్ ప్రైమ్ వేరియంట్ పై రూ. 1.50 లక్షల క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్ అందుబాటులో ఉంది.
మరోవైపు, న్యూ జనరేషన్ టాటా నెక్సాన్ పై ఇంత పెద్ద ఎత్తున భారీ డిస్కౌంట్స్ అందించడం టాటా నుంచి ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ సబ్-4-మీటర్ ఎస్‌యూవీపై రూ. 35,000క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇండియాలో ఈ మోడల్ మొత్తం 6 వేరియంట్స్ మరియు 7 కలర్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉండగా దీనిని ధర రూ. 14.74లక్షలు (ఎక్స్-షోరూం)తో పొందవచ్చు. కొత్త నెక్సాన్ ఈవీని మేము డ్రైవ్ చేసి దీనిని సంబంధించిన పూర్తి రివ్యూను రాసి ఉంచాము. దీనిని మీరు మా కార్వాలే వెబ్ సైట్ ని సందర్శించి చదవవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్