- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో రానున్న నెక్సాన్ ఇవి
- 6 వేరియంట్స్ మరియు 7 కలర్స్ తో అందుబాటులోకి రానున్న నెక్సాన్ ఇవి
నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్ అయినప్పటి నుండి ధరల కోసం వేచిచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు నేడు టాటా మోటార్స్ కంపెనీ నెక్సాన్ మోడల్ వేరియంట్ ధరలను ప్రకటించింది. టాటా నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 14.74 లక్షలుగా టాటా మోటార్స్ కంపెనీ పేర్కొన్నది.
వేరియంట్స్ మరియు కలర్స్
నెక్సాన్ ఇవి ఫేస్‍లిఫ్ట్ ఆరు వేరియంట్స్ తో మార్కెట్లోకి వచ్చింది. ఇది క్రియేటివ్+, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్+, ఫియర్‌లెస్+ఎస్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ వేరియంట్స్ మరియు ఫియర్‌లెస్ పర్పుల్, క్రియేటివ్ ఓషన్, డేటోనా గ్రే, ఇంటెన్సి-టీల్, ప్రిస్టిన్ వైట్, ఫ్లేమ్ రెడ్ ఎంపవర్డ్ ఆక్సైడ్ వంటి ఏడు రంగులలో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ వేరియంట్స్ ధరలను తెలుసుకుందాం.
వేరియంట్స్ మరియు వాటి ధరలు:
ఇక్కడ కింద ఇవ్వబడిన వేరియంట్స్ మరియు వాటి ధరలు ఎక్స్ పోరూమ్ ధరలు మాత్రమే, ఆన్ రోడ్ ధరలు కార్ వేరియంట్ ని బట్టి మారవచ్చు.
వేరియంట్ | ఎక్స్ షోరూం ధరలు (లక్షలు) |
క్రియేటివ్+ మీడియం రేంజ్ | రూ.14.74 లక్షలు |
ఫియర్‌లెస్ మీడియం రేంజ్ ఫియర్‌లెస్ లాంగ్ రేంజ్ | రూ.16.19 లక్షలు రూ.18.19 లక్షలు |
ఫియర్‌లెస్+ మీడియం రేంజ్ ఫియర్‌లెస్ లాంగ్ రేంజ్ | రూ.16.69 లక్షలు రూ.18.69 లక్షలు |
ఫియర్‌లెస్+ఎస్ మీడియం రేంజ్ ఫియర్‌లెస్ లాంగ్ రేంజ్ | రూ.17.19 లక్షలు రూ.19.19 లక్షలు |
ఎంపవర్డ్ మీడియం రేంజ్ | రూ. 17.84 లక్షలు |
ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ | రూ. 19.94లక్షలు |
ఇంటీరియర్ ఫీచర్స్
ఫీచర్స్ పరంగా చూస్తే, నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ లో 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం వైర్ లెస్ మొబైల్ కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ ఇన్‍స్ట్రుమెంట్ క్లస్టర్, రీజనరేటివ్ బ్రేకింగ్ కోసం ప్యాడిల్ షిఫ్టర్స్, స్టీరింగ్ వీల్ పై చూడడానికి ఆశ్చర్యపరిచేలా ఉండే లోగో టూ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ మరియు ఎలక్ట్రిక్ సన్‍రూఫ్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అదనంగా, ఇందులో కూల్డ్ గ్లోవ్ బాక్స్, 360 డిగ్రీ కెమెరా, జెబిఎల్ 9- స్పీకర్స్ మ్యూజిక్ సిస్టం మరియు వైర్‍లెస్ చార్జర్ ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఇవి ఫేస్‍లిఫ్ట్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తుంది, అవేవి అంటే మీడియం రేంజ్ వెర్షన్ మరియు లాంగ్ రేంజ్ వెర్షన్. ఇంతకు ముందున్న మీడియం రేంజ్ వెర్షన్ 30 కిలో వాట్ హార్(kWh) ఫుల్ చార్జ్ తో 325 కి.మీ ఇస్తుండగా, ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న లాంగ్ రేంజ్ వెర్షన్ 40.5 కిలో వాట్ హార్(kWh) ఫుల్ చార్జ్ తో 465కి.మీ ప్రయాణం చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. కేవలం 8.9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోవచ్చని, అదేవిధంగా 150 కి.మీ టాప్ స్పీడ్‍ను ఈజీగా చేరుకోవచ్చని టాటా నెక్సాన్ ఇవి ప్రకటించింది.
ఇంకా కొత్త విషయం ఏంటి అంటే, ఒక నెక్సాన్ ఇవి కారు నుంచి మరొక నెక్సాన్ ఇవి కారును ఛార్జింగ్ కూడా చేయవచ్చు. అలాగే కారులో ఉన్న ఎమర్జెన్సీ బటన్ క్లిక్ చేసి టాటా కంపెనీ సపోర్ట్ నుంచి అత్యవసర సహాయాన్ని కూడా పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే నెక్సాన్ ఇవి కారును బుక్ చేసుకొని రైడ్ ని ఎంజాయ్ చేయండి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్