- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న నెక్సాన్ ఇవి
- ఫుల్ ఛార్జ్ తో 465 కి.మీ రేంజ్ వరకు డ్రైవ్ చేయవచ్చని ప్రకటించిన టాటా
టాటా మోటార్స్ సంస్థ నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ ఎలక్ట్రిక్ వెర్షన్‍ను ఇండియాలో 2023లో సెప్టెంబర్ 7న ఆవిష్కరించింది. ఇప్పుడు, ఆ తయారీ సంస్థ కేవలం రూ. 21,000 టోకెన్ మొత్తంతో ఎస్‍యూవి బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు అధికారిక షోరూమ్ నుండి టాటా బ్రాండ్ ఆన్‍లైన్ పోర్టల్ ద్వారా నెక్సాన్ ఇవిని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
నెక్సాన్ ఇవి ఫేస్‍లిఫ్ట్ ఆరు వేరియంట్స్ తో మార్కెట్లోకి వచ్చింది. ఇది క్రియేటివ్+, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్+, ఫియర్‌లెస్+ఎస్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ వేరియంట్స్ మరియు ఫియర్‌లెస్ పర్పుల్, క్రియేటివ్ ఓషన్, డేటోనా గ్రే, ఇంటెన్సి-టీల్, ప్రిస్టిన్ వైట్, ఫ్లేమ్ రెడ్ ఎంపవర్డ్ ఆక్సైడ్ వంటి ఏడు రంగులలో అందుబాటులో ఉంది.
ఫీచర్స్ పరంగా చూస్తే, నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ లో 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం వైర్ లెస్ మొబైల్ కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ ఇన్‍స్ట్రుమెంట్ క్లస్టర్, రీజనరేటివ్ బ్రేకింగ్ కోసం ప్యాడిల్ షిఫ్టర్స్, స్టీరింగ్ వీల్ పై చూడడానికి ఆశ్చర్యపరిచేలా ఉండే లోగో టూ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ మరియు ఎలక్ట్రిక్ సన్‍రూఫ్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అదనంగా, ఇందులో కూల్డ్ గ్లోవ్ బాక్స్, 360 డిగ్రీ కెమెరా, జెబిఎల్ 9- స్పీకర్స్ మ్యూజిక్ సిస్టం మరియు వైర్‍లెస్ చార్జర్ ఉన్నాయి.
టాటా నెక్సాన్ ఇవి ఫేస్‍లిఫ్ట్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తుంది, అవేవి అంటే మీడియం రేంజ్ వెర్షన్ మరియు లాంగ్ రేంజ్ వెర్షన్. ఇంతకు ముందున్న వెర్షన్ 30 కిలో వాట్ హార్(kWh) ఫుల్ చార్జ్ తో 325 కి.మీ ఇస్తుండగా, ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న వెర్షన్ 40.5 కిలో వాట్ హార్(kWh) ఫుల్ చార్జ్ తో 465కిమీ ప్రయాణం చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. కేవలం 8.9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకోవచ్చని, అదేవిధంగా 150 కి.మీ టాప్ స్పీడ్‍ను ఈజీగా చేరుకోవచ్చని టాటా నెక్సాన్ ఇవి ప్రకటించింది.
అనువాదించిన వారు : సంజయ్ కుమార్