- 2023 మోడల్ స్టాక్ పై మాత్రమే ఈ ఆఫర్లు వర్తింపు
- అందుబాటులో ఉన్న మీడియం-రేంజ్ మరియు లాంగ్-రేంజ్ వెర్షన్
టాటా మోటార్స్ తనఅప్డేటెడ్ నెక్సాన్ ఈవీపై ఈ నెల రూ.1 లక్ష వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యువిని ప్రస్తుతంరూ. 14.74 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో 6 వేరియంట్స్ లో పొందవచ్చు.
నెక్సాన్ ఈవీని బుక్ చేయాలనుకుంటున్న కస్టమర్లు, 2023 మోడల్ ను బుక్ చేసుకున్న తర్వాత, 2023 మోడల్ స్టాక్ పై మాక్సిమం బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ లో క్యాష్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ మరియు ఇతర డీలర్ - ఆఫర్లు ఉన్నాయి. అయితే, ఇతర వేరియంట్లను బట్టి ఈ అమౌంట్ మారవచ్చు. అలాగే, లాంగ్-రేంజ్ వెర్షన్ పై అత్యధిక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
నెక్సాన్ ఈవీని రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో పొందవచ్చు. మొదటిది 30kWh యూనిట్ 325 కిమీ వరకు క్లెయిమ్డ్ రేంజ్ నిఅందిస్తుండగా, రెండోది 40.5kWh యూనిట్ 465 కిమీ వరకు క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తుంది. అలాగే లాంగ్ రేంజ్ వెర్షన్ 143bhp మరియు 215Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.అంతేకాకుండా, దీనిని 7.2kW ఏసీ ఛార్జర్‌ని ఉపయోగించి ఆరు గంటల్లో 10 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప