- ఇండియాలో రూ.11.45 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ధరలు ప్రారంభం
- పెట్రోల్, డీజిల్ పవర్ ట్రెయిన్లలో రెండు వేరియంట్లలో లభ్యం
ఈ నెల ప్రారంభంలో, టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్యూవీ డార్క్ ఎడిషన్ ని దేశవ్యాప్తంగా లాంచ్ చేయగా, దీని ధరలు రూ.11.45 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమయ్యాయి. చెప్పాలంటే ఇది క్రియేటివ్ మరియు ఫియర్ లెస్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, కేవలం రూ.35,000 ప్రీమియం ధరతో వీటికి సమానమైన స్పెషల్ ఎడిషన్ కూడా లభ్యమవుతుంది. ఈ ఆర్టికల్ ద్వారా, ఇండియాలోని టాప్-10 సిటీల్లో తాజాగా లాంచ్ అయిన టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ ఆన్-రోడ్ ధరల వివరాలను తెలుసుకుందాం.
సిటీ | బేస్ వేరియంట్ | టాప్ వేరియంట్ |
ముంబై | రూ. 13.63 లక్షలు | రూ. 19.08 లక్షలు |
ఢిల్లీ | రూ. 13.41 లక్షలు | రూ. 18.83 లక్షలు |
హైదరాబాద్ | రూ. 14.17 లక్షలు | రూ. 19.51 లక్షలు |
విజయవాడ | రూ. 14.17 లక్షలు | రూ. 19.51 లక్షలు |
చెన్నై | రూ. 14.30 లక్షలు | రూ. 19.68 లక్షలు |
కోల్ కతా | రూ. 13.37 లక్షలు | రూ. 18.40 లక్షలు |
బెంగళూరు | రూ. 13.84 లక్షలు | రూ. 19.52 లక్షలు |
పూణే | రూ. 13.63 లక్షలు | రూ. 19.08 లక్షలు |
చండీగర్ | రూ. 12.75 లక్షలు | రూ. 17.53 లక్షలు |
కొచ్చి | రూ. 13.93 లక్షలు | రూ. 19.49 లక్షలు |
పవర్ ట్రెయిన్స్ విషయానికి వస్తే, టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ ని 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ లేదా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ తో పొందవచ్చు. ఇందులో ట్రాన్స్మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డిసిటి, మరియు ఎఎంటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్