- ఓబెరాన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ ని పొందిన నెక్సాన్
- దీంతో పాటుగా లాంచ్ అయిన నెక్సాన్ ఈవీ, సఫారీ, మరియు హరియర్ డార్క్ ఎడిషన్స్
కొన్ని రోజుల క్రితం, టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‍యూవీ యొక్క డార్క్ ఎడిషన్ ని లాంచ్ చేస్తుందని మేము తెలిపాము. ఇప్పుడు, ఆటోమేకర్ మొత్తానికి దేశవ్యాప్తంగా రూ.11.45 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరలతో ఈ ఎస్‍యూవీ యొక్క కొత్త స్పెషల్ ఎడిషన్ ని పరిచయం చేసింది.
డిజైన్ పరంగా, నెక్సాన్ డార్క్ ఎడిషన్ #Dark బ్యాడ్జెస్ తో పాటుగా మోడల్ అంతటా ఎక్స్‌క్లూజివ్ ఓబెరాన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ ని పొందింది. ఇంకా చెప్పాలంటే, ఇది సరికొత్త బ్లాక్-అవుట్ ఫ్రంట్ గ్రిల్, రూఫ్ రెయిల్స్, ఓఆర్విఎం మరియు అల్లాయ్ వీల్స్ ని కలిగి ఉంది. అలాగే ఓ రకంగా చెప్పాలంటే, స్టాండర్డ్ వేరియంట్ తో పోలిస్తే ఈ ఎస్‍యూవీ ఒకేలా ఉంది.
ఇంటీరియర్ పరంగా, లోపల ఈ అటోమేకర్ ఇంతకు ముందున్న థీమ్ ని ఇందులో కూడా కొనసాగిస్తుంది. క్యాబిన్ అంతటా ఆల్-బ్లాక్ ట్రీట్ మెంట్ ని పొంది హెడ్ రెస్ట్స్ పై డార్క్ బ్యాడ్జింగ్ ఎంబ్రాయిడరీతో పాటుగా ఫీచర్డ్ బ్లాక్ లెదరెట్ సీట్లను కలిగి ఉంది. ఇతర ముఖ్యమైన మార్పులను గమనిస్తే, ఇందులో వైర్ లెస్ ఛార్జర్ మరియు “హిడెన్ అన్ టిల్ లిట్” ఎయిర్ కాన్ ప్యానెల్ ఉన్నాయి.
ఆటోమేకర్ టాటా దీనికి సంబంధించిన పవర్ ట్రెయిన్స్ మరియు వేరియంట్ల గురించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించనప్పటికీ, ఈ ఎస్‍యూవీ యొక్క స్పెషల్ ఎడిషన్ టాప్-స్పెక్ వేరియంట్లలో మాత్రమే టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో అందించబడే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్