టాటా మోటార్స్ భారత్ మొబిలిటీ షో 2024లో అత్యంత ముఖ్యమైనదిగా నిలిచి, కొత్త నెక్సాన్ ఐ-సిఎన్‍జి ని ప్రదర్శించింది. దీనితో, ఇండియన్ ఆటోమేకర్ మారుతి సుజుకి తర్వాత కంపెనీ ఫిట్టెడ్ కిట్‌తో కాంపాక్ట్ ఎస్‌యువిని బండిల్ చేసిన రెండవ మానుఫాక్చర్ గా నిలిచింది. అయితే, ఈ విభాగానికి బ్రెజా సిఎన్‍జి నాయకత్వం వహించగా, నెక్సాన్ లో అందించే ఐ-సిఎన్‍జి వేరేగా ఉంటుంది. ఇది ఎంత వేరేగా ఉంటుంది అనేది, ఈ కథనంలో, టాటా నెక్సాన్ సిఎన్‍జి మరియు మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జి స్పెసిఫికేషన్‌ల ద్వారా మనం తెలుసుకుందాం.
మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జి
మారుతి సుజుకి బ్రెజా మొదటిసారిగా మార్చి 2023లో ఇండియాలో ప్రవేశపెట్టబడింది. ఇది LXi, VXi మరియు ZXi అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, దీనిని రూ. 9.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. ఈ ఎస్‌యువి 1.5-లీటర్ K15C నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో ఫ్యాక్టరీ ఫిట్టెడ్, సింగిల్-సిలిండర్, సిఎన్‍జి కిట్‌తో అందుబాటులో ఉంది. ఈ మోటార్ ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి, 87bhp మరియు 121Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
పవర్‌ట్రెయిన్ | పవర్ అవుట్‌పుట్ | మైలేజ్ |
1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ | 87bhp/121Nm | 25.51కిమీ/కేజీ |
టాటా నెక్సాన్ సిఎన్‍జి
టాటా నెక్సాన్ ఐ-సిఎన్‍జి ఇటీవలే భారత్ మొబిలిటీ షో 2024లో ప్రదర్శించబడింది. ఇది మోడరన్ టెక్నాలజీ తో కూడిన మొట్టమొదటి టర్బో-పెట్రోల్-పవర్డ్ సిఎన్‍జి కారు అని చెప్పవచ్చు. దాని పోటీ నుండి దీనిని వేరుగా ఉంచడం అనేది ట్విన్-సిలిండర్ సిఎన్‍జి టెక్నాలజీ, ఇది సుమారు 230 లీటర్ల బూట్ స్పేస్‌తో 60 లీటర్ల గ్యాస్‌ను కలిగి ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ యొక్క పవర్ అవుట్‌పుట్‌ను ఆటోమేకర్ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఇందులో మోటార్ పెట్రోల్-పవర్డ్ ఇంజిన్ 118bhp మరియు 170Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
అంతేకాకుండా, నెక్సాన్ ఐ-సిఎన్‍జి మైక్రో స్విచ్, లీకేజ్ ప్రూఫ్ మెటీరియల్స్, థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్, సింగిల్ అడ్వాన్స్‌డ్ ఈసీయూ, సిఎన్‍జి మోడ్‌లో డైరెక్ట్ స్టార్ట్, ఫ్యూయల్స్ మధ్య ఆటో స్విచ్, మాడ్యులర్ ఫ్యూయల్ ఫిల్టర్ మరియు లీక్ డిటెక్షన్ ఫెయిల్యూర్ వంటి సేఫ్టీ ఫీచర్ల ను కలిగి ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప