- కొత్తగా 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో రానున్న సిఎన్‍జి మోడల్
- పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలాగే ఒకే రకమైన లుక్ తో వస్తున్న నెక్సాన్ సిఎన్‍జి
టాటా మోటార్స్ నుంచి భారత్ మొబిలిటీ షో-2024లో ప్రదర్శించబడిన మోడల్స్ లో నెక్సాన్ సిఎన్‍జి మోడల్ అతి పెద్ద హైలైట్ గా నిలిచింది. మరికొన్ని నెలల్లో ఈ పాపులర్ కాంపాక్ట్ ఎస్‍యువి సిఎన్‍జి-పవర్డ్ వెర్షన్ మోడల్ ఇండియాలో లాంచ్ కానుండగా, లాంచ్ అయిన తర్వాత మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జితో పోటీపడనుంది.
నెక్సాన్ సిఎన్‍జి మోడల్ కొత్తగా 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. లాంచ్ తర్వాత, ఇండియాలో విక్రయించబడే మొట్ట మొదటి టర్బో-పెట్రోల్ సిఎన్‍జి వెహికిల్ ఇదే కానుంది. పెట్రోల్ మోడ్ లో ఈ మోడల్, అవుట్ పుట్ వివరాలలో ఎలాంటి మార్పులు లేకుండా 118bhp మరియు 170Nm టార్కును ఉత్పత్తి చేసే ఇంజిన్ తో వచ్చే అవకాశం ఉంది. అలాగే సిఎన్‍జి మోడ్ లో, దీని పవర్ మరియు టార్క్ తక్కువగా ఉంటుండగా, సరైన అవుట్ పుట్ వివరాలు మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేవు.
మరోవైపు మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జి 1.5-లీటర్ K15C నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సింగిల్-సిలిండర్ సిఎన్‍జి కిట్ తో వచ్చింది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి 87bhp మరియు 121Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇక నెక్సాన్ విషయానికి వస్తే, కారులో మరింత స్పేస్ తో సౌకర్యంగా ఉండేలా ట్విన్-సిలిండర్ సిఎన్‍జి సెటప్ తో మరియు మరింత బూట్ స్పేస్ ని పొందనుంది. ఈ సెటప్ వీలుగా ఉండేందుకు దాదాపుగా 230-లీటర్ల బూట్ స్పేస్ తో 60-లీటర్ల గ్యాస్ సిలిండర్ స్పేస్ ని కలిగి ఉంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్