- 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడనున్న మోడల్
- ఇండియాలోఇదే మొట్టమొదటి టర్బో-పెట్రోల్ సిఎన్‍జి ఎస్‌యువి
టాటా మోటార్స్ కర్వ్ ఈవీ వెర్షన్ మరియు కర్వ్ ఐసీఈ వెర్షన్లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో ఈరెండు మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుండగా, నెక్సాన్ సిఎన్‍జి వెర్షన్ లాంచ్‌తో కూడా ఉండడంతో ఆటోమేకర్ కు సెప్టెంబర్ నెల అంతే ముఖ్యమైనదిగా మారింది.
టాటా నెక్సాన్ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ మరియు ఈవీ అనే వివిధ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అలాగే, సిఎన్‍జి వెర్షన్ ద్వారా, వివిధ పవర్‌ట్రెయిన్ లతో వచ్చిన నెక్సాన్ నేమ్‌ప్లేట్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారుతుంది.
నెక్సాన్ సిఎన్‍జి ఇతర టాటా మోడల్స్ వలె అదే ట్విన్ సిఎన్‍జి సిలిండర్ టెక్‌ని ఉపయోగిస్తుంది. కానీ ఇతర ప్రొడక్ట్స్ మాదిరిగా కాకుండా, నెక్సాన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ సిఎన్‍జి కిట్ తో జతచేయబడి రానుంది . 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మోటార్, స్టాండర్డ్ మోడ్‌లో, 118bhp మరియు 170Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ని చూస్తే, నెక్సాన్ సిఎన్‍జి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ని పొందే అవకాశం ఉంది. ఇప్పుడు, టియాగో మరియు టిగోర్ మోడళ్లలో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన సిఎన్‍జి కిట్‌ని మనం చూశాము. కాబట్టి, టాటా నెక్సాన్ సిఎన్‍జితో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని తీసుకురాగలిగితే, సిఎన్‍జి కార్ల అత్యంత చవకగా ధరతో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సౌలభ్యాన్ని కోరుకునే ప్రేక్షకులను అది ఆకర్షిస్తుంది.
సెప్టెంబర్‌లో లాంచ్ అయిన తర్వాత, టాటా నెక్సాన్ సిఎన్‍జి కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జికి పోటీగా ఉంటుంది. ఇదిలా ఉండగా, స్టాండర్డ్ వెర్షన్ కంటేప్రీమియం వెర్షన్ ధర రూ. 60,000నుంచి రూ. 80,000 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప