- 2024 భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శన
- 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానున్న కొత్త మోడల్
టాటా దాని నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‍యూవీలో తదుపరి పెద్ద అప్‌గ్రేడ్ సిఎన్‍జి-పవర్డ్ మోడల్ లో రానుంది, ఇది ఈ ఏడాది చివర్లో దాని లాంచ్ ముందే రియల్ వరల్డ్ టెస్టింగ్ చేయబడుతుంది. పూణే సమీపంలోని సిఎన్‍జి ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా అందించిన సమాచారం ప్రకారం, ఇక్కడ గుర్తించబడిన కారు వైట్ కలర్ టాప్-స్పెక్ మోడల్.
వాస్తవికంగా చెప్పాలంటే, నెక్సాన్ సిఎన్‌జి ధరలు మరియు లాంచ్ అయినప్పుడు అందించే వేరియంట్‌ల సంఖ్యతో పాటు దాని గురించి సమాచారం మనకు చాలా తక్కువే ఉన్నాయి. ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన టాటా కారు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ (ఫస్ట్-ఇన్-సెగ్మెంట్) ద్వారా ఆధారితమైన టాప్-స్పెక్ మోడల్ స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ లో 118bhp/170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, సిఎన్‌జి వెర్షన్ లో 100bhp/150Nm వరకు ఉత్పత్తి చేస్తుందని అంచనా, ఇది ఓ రకంగా బెస్ట్ అని చెప్పవచ్చు. అధికారికంగా, టాటా కేవలం 6-స్పీడ్ ఎంటిని మాత్రమే నిర్ధారించింది, అయితే లాంచ్ అయిన కొంతకాలం తర్వాత 6-స్పీడ్ ఏఎంటి కూడా అందించాబడుతుందని మేము ఆశిస్తున్నాము.
ఈ సిఎన్‌జి కారు టాటా, మారుతి మరియు టయోటా కు తదుపరి కాంపీటీషన్ గా మారనుంది. నెక్సాన్ అనేది టాటా చాలా విజయవంతమైన కారు అని, భవిష్యత్తులో సంసిద్ధతగా సిఎన్‌జి-ప్రారంభించబడిన మోడల్ అని చెప్పవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప