- 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఎంటి)తో మాత్రమే అందుబాటులో ఉన్న మోడల్
- ఇప్పుడు పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి మరియు ఈవీ వెర్షన్స్ లో కూడా అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్
ఇండియాలో లాంచ్
ఈ నెల అనగా అక్టోబర్ ప్రారంభంలో నెక్సాన్ సిఎన్‌జి వెర్షన్ ని టాటా రూ. 8.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఇది వివిధ వేరియంట్‌లలో కేవలం త్రీ-పెడల్ పవర్‌ట్రెయిన్ సెటప్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారును మేము డ్రైవ్ చేశాము మరియు దీనికి సంబంధించిన రివ్యూ మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మీరు ఈ రివ్యూను చూడవచ్చు. మేము దీనిపై రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్ కూడా నిర్వహించాము. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్ వివరాలు
నెక్సాన్ సిఎన్‌జి1.2-లీటర్ టర్బో పెట్రోల్ టాటా ఇంజన్ ను పొందింది. స్టాండర్డ్ వెర్షన్ లో ఈ ఇంజన్ 118bhp/170Nm టార్క్‌ను మరియు సిఎన్‌జివెర్షన్లో 98bhp/170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ స్టాండర్డ్ గా రాగా, నాన్-సిఎన్‌జి కంప్లైంట్ ఇంజన్ ని 7-స్పీడ్ డిసిటితో కూడా పొందవచ్చు. అలాగే, సిఎన్‌జి ఇంజన్ కోసం ఆటోమేకర్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ టాటాలోని సోర్సెస్ కూడా సూచించాయి, అయితే ప్రస్తుతం ఇందులో ఏదీ కూడా అధికారికం కాదు.
రియల్ వరల్డ్ మైలేజ్
స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్లో, ఈ గేర్‌బాక్స్‌తో కూడిన ఈ ఇంజన్ 17.44కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుంది. అధికారికంగా, టాటా మైలేజ్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. కాకపోతే, మేము కారుని రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్చేశాము. వాటి రిజల్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మేము నిర్వహించిన రియల్ వరల్డ్ టెస్టులో నెక్సాన్ సిఎన్‌జి కారు, సిటీలో 11.65కిమీ/కిలో మరియు హైవేపై 17.5కిలోమీటర్ల/కిలో మైలేజీని అందించింది. సగటున చూస్తే, సిటీ మరియు హైవేపై కలిపి ఈ కారు 13కిలోమీటర్ల/కిలో మైలేజీని మాత్రమే అందించింది.
అనువాదించిన వారు: రాజపుష్ప