- ఇండియాలో అందించబడిన మొట్టమొదటి టర్బోచార్జ్డ్ పెట్రోల్ సిఎన్‌జి ఎస్‌యువి
- రూ. 8.99 లక్షలతో ధరలు ప్రారంభం
టాటా మోటార్స్ ఎట్టకేలకు ఇండియాలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న నెక్సాన్ సిఎన్‌జిని లాంచ్ చేసింది. నెక్సాన్ సిఎన్‌జి కారును ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో తొలిసారిగా టాటా ప్రదర్శించింది. అలాగే, ఈ సెగ్మెంట్‌లో సిఎన్‌జి తో నడిచే సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యువితో పాటుబ్రెజా కూడా ఉంది. ఈ కథనంలో, కొత్త టాటా నెక్సాన్ సిఎన్‌జి గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని మేము లిస్ట్ చేసాము.
వేరియంట్లు మరియు ధరలు
కొత్త నెక్సాన్ సిఎన్‌జి, స్మార్ట్ (O), స్మార్ట్+, స్మార్ట్+ S, ప్యూర్, ప్యూర్ S, క్రియేటివ్, క్రియేటివ్+, మరియు ఫియర్‌లెస్+ PS అనే 8 వేరియంట్‌లలో అందించబడుతోంది.
వేరియంట్ వారీగా నెక్సాన్ సిఎన్‌జి ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఎక్స్-షోరూమ్ ధరలు |
స్మార్ట్ (O) | రూ.8.99 లక్షలు |
స్మార్ట్+ | రూ. 9.69 లక్షలు |
స్మార్ట్+S | రూ. 9.99 లక్షలు |
ప్యూర్ | రూ.10.69 లక్షలు |
ప్యూర్S | రూ.10.99 లక్షలు |
క్రియేటివ్ | రూ. 11.69 లక్షలు |
క్రియేటివ్+ | రూ. 12.19 లక్షలు |
ఫియర్‌లెస్+ PS | రూ. 14.59 లక్షలు |
ఇంటీరియర్ మరియు ఫీచర్లు
నెక్సాన్ సిఎన్‌జి, స్టాండర్డ్ నెక్సాన్ నుండి డిజైన్ ఎలిమెంట్లను పొందగా, ఇంటీరియర్ లో కొన్ని ఫీచర్లతో సహా అంశాలను పొందింది. ముందుగా చెప్పాలంటే, నెక్సాన్ సిఎన్‌జి టాప్-స్పెక్ వెర్షన్ పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ ను పొందింది. ఈ ఫీచర్ స్టాండర్డ్ పెట్రోల్ వేరియంట్ మరియు డీజిల్ వేరియంట్ లో లేదు.
ఇంకా ఇందులో ఇతర ఫీచర్లు చూస్తే, 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, నావిగేషన్ సపోర్ట్‌తో 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కూల్డ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, 8 స్పీకర్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్ మరియు వైపర్‌లు మరియు సీక్వెన్షియల్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ మరియు టెయిల్‌ల్యాంప్స్ వంటివి ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్
మెకానికల్‍గా, నెక్సాన్ సిఎన్‌జి 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ట్విన్ సిఎన్‌జి సిలిండర్ ట్యాంక్‌లతో జత చేయబడింది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి 99bhp మరియు 170Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఇంకా, సిఎన్‌జి ట్యాంక్‌లను అమర్చడంతో, నెక్సాన్ సిఎన్‌జి వెర్షన్స్ లో 321 లీటర్ల వరకు బూట్ స్పేస్ మిగిలి ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప