- భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2024లో ప్రదర్శించే అవకాశం
- నెక్సాన్ సిఎన్‌జిలో 230 లీటర్ల బూట్ స్పేస్ లభ్యం
రేపు జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో టాటా మోటార్స్ 8 ఉత్పత్తులను పరిచయం చేయనుంది. ఇందులోనెక్సాన్ సిఎన్‌జి, నెక్సాన్ ఈవీడార్క్ ఎడిషన్, సఫారి డార్క్, కర్వ్ కాన్సెప్ట్, ఆల్ట్రోజ్ రేసర్ కాన్సెప్ట్, హారియర్ ఈవీకాన్సెప్ట్, సఫారి మరియు ఇటీవలే ప్రారంభించిన పంచ్ ఈవీ వంటి మోడల్స్ ఉంటాయి.
టాటా నెక్సాన్ సిఎన్‌జి కాన్సెప్ట్
నెక్సాన్ఎస్‌యువిట్విన్-సిలిండర్ సిఎన్‌జి కిట్‌తో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండనుంది. సిఎన్‌జి సిలిండర్లలో 60 లీటర్ల గ్యాస్ స్పేస్ ఉండగా,మరియు దాని బూట్ స్పేస్ 230 లీటర్లు ఉంటుంది. ఇది కాకుండా, నెక్సాన్స సిఎన్‌జి మైక్రో స్విచ్, లీకేజ్ ప్రూఫ్ మెటీరియల్, థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్, సింగిల్ అడ్వాన్స్‌డ్ ఈసీయూ, సిఎన్‌జి మోడ్‌లో డైరెక్ట్ స్టార్ట్, మాడ్యులర్ ఫ్యూయల్ ఫిల్టర్ మరియు లీక్ డిటెక్షన్ ఫెయిల్యూర్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండనుంది.
నెక్సాన్ ఈవీడార్క్ ఎడిషన్
నెక్సాన్ ఈవీఫేస్‌లిఫ్ట్ మొదటిసారిగా కొత్త డార్క్ ఎడిషన్‌లో అందించబడుతోంది. ఈ ప్రత్యేక ఎడిషన్ దిగువ బంపర్‌పై సిగ్నేచర్ '#డార్క్ అక్షరాలు, డార్క్ ఎక్స్‌టీరియర్ మరియు పియానో బ్లాక్ కలర్ తో రాబోతుంది. అలాగే, ఇందులో 16-ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఫీచర్ల గురించి మాట్లాడితే, డార్క్ ఎడిషన్‌లో ఎల్ఈడీలతో కూడిన స్మార్ట్ డిజిటల్ లైట్లు, ముందు మరియు వెనుక భాగంలో పొడవైన ఎల్ఈడీ స్ట్రిప్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు డిజిటల్ X- ఫ్యాక్టర్ ఇందులో ఉన్నాయి.
మరో వార్తలో,టాటా నెక్సాన్ ఐ-సిఎన్‌జి భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో అత్యంత ఆసక్తికరమైన లాంచ్ అవుతుంది, ఎందుకంటే ఇది సిఎన్‌జితో వచ్చిన మొదటి టర్బోచార్జ్డ్ కాంపాక్ట్ఎస్‌యువి.