- ఇండియాలో ఎక్కువ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ కలిగి ఉన్న కారుగా నిలిచిపోనున్న నెక్సాన్
- ఇండియాలో అందించనున్న మొట్టమొదటి టర్బో-పెట్రోల్ ఇంజిన్ కారు
టాటా మోటార్స్ ఇండియాలో మరికొన్ని వారాల్లో సిఎన్‌జి వెర్షన్‌ను లాంచ్ చేసి, త్వరలోనే టాటా నెక్సాన్ రేంజ్ ని మరింతగా పెంచడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రొడక్షన్ రెడీ అవతార్‌లో 2024 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది, టాటా నుండి స్థిరంగా ట్విన్ సిఎన్‌జి సిలిండర్ టెక్నాలజీని పొందిన మూడవ కారు ఈ సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీ అని చెప్పవచ్చు.
డిజైన్ పరంగా చూస్తే, పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ ను పోలి నెక్సాన్ సిఎన్‌జి వెర్షన్ ఉంటుంది. ఇది వెనుక భాగంలో ఐ-సిఎన్‍జి బ్యాడ్జింగ్‌ను పొందుతుంది. అలాగే, కారు లోపలి భాగంలో, సింగిల్ అడ్వాన్స్డ్ ఈసీయూ, మాడ్యులర్ ఫ్యూయల్ ఫిల్టర్, ఫ్యూయల్స్ మధ్య ఆటో స్విచ్, సిఎన్‌జి ఫంక్షన్‌లో డైరెక్ట్ స్టార్ట్ మరియు 60 లీటర్ల (నీటికి సమానం) తో నిల్వ ఉన్న సిఎన్‌జి ట్యాంక్ వంటి మార్పులను పొందవచ్చని అంచనా.
స్టాండర్డ్ ఇటరేషన్ తో పోలిస్తే నెక్సాన్ సిఎన్‌జి ఇంటీరియర్ లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 12.3- టచ్‌స్క్రీన్ సిస్టమ్, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ మరియు మరిన్ని ముఖ్యమైన అంశాలను ఇది కలిగి ఉండవచ్చు.
అలాగే , ఈ కారు ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉన్నందున, నెక్సాన్ సిఎన్‌జి వెర్షన్ కి సంబంధించిన పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరాలు ప్రస్తుతానికి టాటా వెల్లడించలేదు. పెట్రోల్ మోడ్‌లో, ఈ కారులోని 1.2-లీటర్ టర్బో ఇంజిన్ 118bhp మరియు 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ని మాత్రమే కాకుండా సిఎన్‌జి వేరియంట్ తో సెగ్మెంట్-ఫస్ట్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ను కూడా కలిగి ఉంటుంది.
సిఎన్‌జి వెర్షన్ నెక్సాన్ కార్డ్‌లలో ఈ ఒక్క అప్‌డేట్ మాత్రమే కాకుండా, బ్రెజా, సోనెట్ మరియు వెన్యూకి గట్టి పోటీగా ఉండేందుకు (భవిష్యత్తులో) డిసిటి గేర్‌బాక్స్‌ను కూడా పొందుతుంది, వీటి వివరాలు ఇటీవలే బ్రాండ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నిర్ధారించబడ్డాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప