- ఎనిమిది వేరియంట్లలో లభ్యం
- రూ.8.99 లక్షలతో నెక్సాన్ సిఎన్‍జి ధరలు ప్రారంభం
టాటా మోటార్స్ లేటెస్టుగా దాని మోస్ట్ పాపులర్ ఎస్‍యూవీ మోడల్ అయిన నెక్సాన్ కారులో కొత్తగా సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ని లాంచ్ చేసింది. దీంతో ఇప్పుడు నెక్సాన్ కారు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మరియు సిఎన్‍జి అపవార్ ట్రెయిన్ ఆప్షన్లతో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీని సిఎన్‍జి టైపులో ఎనిమిది వేరియంట్లలో పొందవచ్చు. ధరల విషయానికి వస్తే, నెక్సాన్ సిఎన్‍జి ధరలు రూ.8.99 లక్షల ఎక్స్-షోరూం ధరతో ప్రారంభమయ్యాయి. లాంచ్ తర్వాత ఇప్పుడు, నెక్సాన్ సిఎన్‍జి కారు దేశవ్యాప్తంగా ఉన్న షోరూంల వద్దకు చేరుకోవడం కూడా ప్రారంభమైంది.
మొత్తంగా సిఎన్‍జి-పవర్డ్ నెక్సాన్ కారు స్మార్ట్ (O), స్మార్ట్+, స్మార్ట్+ఎస్, ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్+, మరియు ఫియర్ లెస్+ ఎస్ అనే ఎనిమిది వేరియంట్లలో అందించబడింది. చివరిగా పేర్కొన్న ఫియర్ లెస్+ ఎస్ వేరియంట్ సిఎన్‍జి-పవర్డ్ ఎస్‍యూవీ కారును మీరు పూర్తి ఫీచర్లతో పొందవచ్చు. ఎందుకంటే ఇందులో మీకు నచ్చిన, కావాల్సిన ఫీచర్లు చాలా ఉన్నాయి. అందులో భారీ 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఎనిమిది స్పీకర్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మెకానికల్ గా, నెక్సాన్ సిఎన్‍జి కారులోని 1.2-లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది. అలాగే ఈ ఎస్‍యూవీ కారు టర్బో ఛార్జ్డ్ పెట్రోల్+ సిఎన్‍జి ఆప్షన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో వచ్చి, దేశంలోనే మొట్టమొదటి ఎస్‍యూవీగా నిలిచింది. ఈ కండీషన్లో నెక్సాన్ సిఎన్‍జి 99bhp మరియు 170Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ట్విన్ సిఎన్‍జి సిలిండర్ ట్యాంక్ టెక్నాలజీ కారణంగా, నెక్సాన్ సిఎన్‍జి వెర్షన్ కార్లలో మీకు 321 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.
ప్రస్తుతం, నెక్సాన్ సిఎన్‍జి కారు ప్రధానంగా మారుతి సుజుకి బ్రెజా సిఎన్‍జి కారుతో మాత్రమే పోటీపడుతుండగా, దీనిని 9.29 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్