- బెస్ట్ ఫీచర్లు మరియు కొత్త లుక్‌ని పరిచయం చేసిన టాటా
- రూ.8.45 లక్షల నుంచి ధరలు ప్రారంభం
టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా టాటా పంచ్ నిలిచింది. ఇప్పుడు ఇందులో కొత్తగా కామో స్పెషల్ ఎడిషన్‌ను టాటా మోటార్స్ లాంచ్ చేసింది, దీని ప్రారంభ ధర రూ. 8.45 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ప్రత్యేక ఎడిషన్ అద్భుతమైన సీవీడ్ గ్రీన్ కలర్ మరియు వైట్ రూఫ్‌తో వస్తుంది, దీంతో ఈ కారు లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. అంతే కాకుండా, ఈ కారు R16 చార్‌కోల్ గ్రే అల్లాయ్ వీల్స్ తో రాగా, దీనికి ప్రీమియం కామో థీమ్‌తో కూడిన అప్హోల్స్టరీ కూడా అందించబడింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు టాటా మోటార్స్ వెబ్‌సైట్ నుండి టాటా పంచ్ కామో ఎడిషన్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేసే భారీ 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది, ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇది ఈ ఎడిషన్‌లో మొదటిసారిగా పరిచయం చేయబడింది. ఇందులో అందించబడిన మిగతా ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్ మరియు సి-టైప్ యుఎస్‍బి ఫాస్ట్ ఛార్జర్ వంటి కొత్త ఫీచర్లు అందించబడ్డాయి. గ్రాండ్ కన్సోల్ మరియు ఆర్మ్‌రెస్ట్‌తో పాటు, ఈ ఎడిషన్ స్టైలిష్ మరియు చాలా సౌకర్యవంతమైన ఎక్స్‌పీరియన్స్ ని కూడా అందిస్తుంది.
సేఫ్టీ పరంగా ఎలాంటి సందేహాలు వద్దు. ఎందుకంటే, టాటా పంచ్ కామో ఎడిషన్ 5-స్టార్ గ్లోబల్ ఎన్ క్యాప్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది, ఇది మార్కెట్లో చాలా సేఫ్ ఎస్‍యువిలలో ఒకటిగా నిలిచింది. ఇది 187mm గ్రౌండ్ క్లియరెన్స్ మరియు అద్బుతమైన డిజైన్‌తో ఇండియన్ రోడ్లపై గ్రేట్ పెర్ఫార్మెన్స్ ని అందిస్తుంది. ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్‌లో 4 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్