- ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉన్న నాలుగు ఆల్- ఎలక్ట్రిక్ మోడల్స్
- అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వెహికిల్ గా నిలిచిన నెక్సాన్ ఈవీ
టాటా మోటార్స్ దాని ఎలక్ట్రిక్ వెహికల్ (బిజినెస్)వ్యాపారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది.కార్‌మేకర్ ఇండియాలో 1.5 లక్షల యూనిట్లకు పైగా ఈవీలను విక్రయించింది. అదనంగా, ఈ బ్రాండ్ ఆర్థిక సంవత్సరం- 2023లో 50,000 యూనిట్లతో పోలిస్తే ఆర్థిక సంవత్సరం- 2024లో 73,800 ఈవీలను విక్రయించడం ద్వారా 48 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
టాటా మోటార్స్ ప్రస్తుతం నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ మరియు టిగోర్ ఈవీ అనే నాలుగు ఆల్-ఎలక్ట్రిక్ మోడళ్లను విక్రయిస్తోంది.ధరల విషయానికొస్తే, ఈవీల ధర రూ. 7.99 లక్షలు నుండి రూ. 19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)మధ్య ఉంది. టాటా కంపెనీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్స్ మరియు ఎస్‍యూవీలను విస్తృత రేంజ్ లోని వినియోగదారులకు అందిస్తుంది.
ఇంకా చెప్పాలంటే, కర్వ్ ఈవీ మరియు హారియర్ ఈవీ త్వరలో ఇండియన్ కార్‌మేకర్ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియో లిస్ట్ లో చేరనుండడంతో ఈ లిస్టు మరింత విస్తరించనుంది. అలాగే, ఈ రెండు మోడల్స్ ఆర్థిక సంవత్సరం-2025లో విక్రయించబడనున్నాయి. అలాగే మరోవైపు, ఎడబ్ల్యూడి కాన్ఫిగరేషన్ సూచనతో వెనుకకు అమర్చబడిన మోటారును కలిగి ఉన్న రెండోది ఇటీవల కనిపించింది.
ఇటీవల, టాటా నెక్సాన్ ఈవీ మరియు పంచ్ ఈవీలు భారత్ బిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్‌లలో పూర్తి 5-స్టార్ రేటింగ్‌ను స్కోర్ చేశాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప