- రూ. 15.49 లక్షలు నుండి ప్రారంభంకానున్న ధరలు
- మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఒకే పవర్‌ట్రెయిన్‌లో అందించబడనున్న హారియర్
టాటా మోటార్స్ ఫ్లాగ్ షిప్ ఎస్‍యూవీ హారియర్ యొక్క ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ అక్టోబర్-2023లో లాంచ్ చేసింది. 2019లో లాంచ్ అయినప్పటి నుండి 5-సీటర్ ఎస్‍యూవీకి సంబంధించి ఇదే అతి పెద్ద అప్‍డేట్ అని చెప్పవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీతో పోటీ పడుతున్న దీనికి విపరీతమైన డిమాండ్ పెరగడంతో, ఫలితంగా వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగింది.
ప్రస్తుతం, కస్టమర్స్ ఎవరైతే టాటా హారియర్‌ను కొనుగోలు చేయాలనుకున్నారో వారు కనీసం బుకింగ్ చేసిన తేదీ నుండి 2 నెలల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది హైదరాబాద్ మరియు ముంబైలో బుక్ చేసిన కస్టమర్లకు వర్తించనుంది. అలాగే ఇది డీలర్, వేరియంట్, కలర్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న అధికారిక డీలర్‌షిప్ ని సంప్రదించగలరు.
ముందుగా ఇందులో ఉన్న ప్రధాన అంశాల గురించి చెప్పాలంటే, ఫేస్‍లిఫ్టెడ్ హారియర్‌లో 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్లెస్ మొబైల్ కనెక్టివిటీ, టోగుల్ స్విచ్‌లతో కూడిన కొత్త టచ్‌స్క్రీన్ ఎయిర్‌కాన్ ప్యానెల్, జెబిఎల్-సోర్స్డ్ స్పీకర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు ఇల్యూమినేటెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.
హుడ్ క్రింద ఉన్న హారియర్ యొక్క ఒకే ఒక్క పవర్డ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 170bhp పవర్ మరియు 350Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు ఈ మోటారును 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్