- ప్రస్తుతం డీజిల్ పవర్ ట్రెయిన్ తో మాత్రమే లభిస్తున్న హారియర్
- వచ్చే సంవత్సరం సియెర్రాను కూడా లాంచ్ చేస్తున్న టాటా
గత సంవత్సరం చివరలో టాటా మోటార్స్ దాని పాపులర్ మిడ్-సైజ్ ఎస్‍యూవీ, హారియర్ కి మిడ్-లైఫ్ రీఫ్రెష్ ని తీసుకువచ్చింది. ప్రస్తుతం క్రెటా మరియు గ్రాండ్ విటారాతో పోటీపడుతున్న ఈ మోడల్ కేవలం డీజిల్ పవర్ ట్రెయిన్ తో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు చూస్తే త్వరలోనే ఇందులో మార్పులను తీసుకురానుంది.
టాటా మోటార్స్ తప్పనిసరిగా హారియర్ పెట్రోల్ వెర్షన్ ని తీసుకువస్తున్నట్లు ఇప్పుడు మేము అధికారికంగా మీకు తెలియజేస్తున్నాము. ఈ వెర్షన్ 2025లో పరిచయం చేయబడుతుండగా, ఇది ఆటోమేకర్ ద్వారా ఎస్‍యూవీ ఈవీ డెరివేటివ్ గా కూడా అరంగేట్రం చేయనుంది. పెట్రోల్ వెర్షన్ హారియర్ లైన్లో ఉన్న టయోటా అర్బన్ క్రూజర్ రైడర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు ప్రస్తుతం పెట్రోల్ పవర్డ్ ఆప్షన్ తో విక్రయించబడుతున్న అన్నీ మోడల్స్ తో పోటీ పడుతుంది.
నెక్సాన్ మాదిరిగానే ఎస్‍యూవీలో అందించబడుతున్న హారియర్ ద్వారా దాని పోర్ట్ ఫోలియోని మరింత విస్తరించాలనే లక్ష్యంతో టాటా ముందుకు కొనసాగుతుంది. నెక్సాన్ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, ఈవీ పవర్ ట్రెయిన్లతో అందుబాటులో ఉంది. అదే విధంగా ఇది మరికొన్ని నెలల్లో సిఎన్‍జి వెర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండియాలో జరిగిన భారత్ మొబిలిటీ షోలో నెక్సాన్ సిఎన్‍జి వెర్షన్ ని టాటా ప్రదర్శించింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి మా వెబ్ సైట్ ని సందర్శించగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్