- 13 వేరియంట్స్ లో లభ్యం
- సింగిల్ పవర్ ట్రెయిన్ లో అందుబాటులోకి రానున్న మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్
చివరి నెలలో, టాటా మోటార్స్ హారియర్ ఫేస్‍లిఫ్టును రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‍యూవీ స్మార్ట్, స్మార్ట్(O), ప్యూర్, ప్యూర్(O), ప్యూర్+, ప్యూర్+ S, ప్యూర్+ S డార్క్ ఎడిషన్, అడ్వెంచర్, అడ్వెంచర్+, అడ్వెంచర్+ డార్క్ ఎడిషన్, అడ్వెంచర్+ ఏడీఏఎస్, ఫియర్‌లెస్ మరియు ఫియర్‌లెస్+ అనే 13 వేరియంట్స్ లో 7 ఎక్స్‌టీరియర్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం నవంబర్ నెలలో ఎస్‍యూవీపై ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను ఒకసారి పరిశీలిద్దాం.
ప్రస్తుతం, 2023 హారియర్ ను పొందాలంటే బుకింగ్ రోజు నుండి సుమారుగా 4 నుండి 6 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ ముంబైలో చేసిన బుకింగ్స్ కు మాత్రమే వర్తించనుండగా మరియు వేరియంట్, కలర్ మరియు డీలర్‌షిప్‌ను బట్టి మారే అవకాశం ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీకు సమీపంలో ఉన్న డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.
హారియర్ లో కీలక భాగమైన బిఎస్6 ఫేజ్ 2-అప్ డేటెడ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 170bhp మరియు 350Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విధులను 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ నిర్వర్తిస్తూ, వరుసగా 16.8కెఎంపిఎల్ మరియు 14.6కెఎంపిఎల్ క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తున్నాయి.
ప్రస్తుతం, హారియర్ ఫేస్‍లిఫ్టుకు పోటీగా మహీంద్రా ఎక్స్‌యువి700, ఎస్యూవీహెక్టర్, జీప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్