- రూ.16.19 లక్షలు(ఎక్స్-షోరూం)తో టాటా సఫారి ఫేస్ లిఫ్ట్ ధరలు ప్రారంభం
- రూ.15.49 లక్షలు(ఎక్స్-షోరూం)తో టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్ ధరలు ప్రారంభం
టాటా మోటార్స్ కొన్ని గంటల క్రితం టాటా సఫారి ఫేస్ లిఫ్ట్ మరియు హారియర్ ఫేస్ లిఫ్ట్ ధరలను ప్రకటించింది. ఈ రెండింటి ధరలు రూ.16.19 లక్షలు(ఎక్స్-షోరూం) మరియు రూ.15.49 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉన్నాయి. లాంచ్ కు కొద్ది నిమిషాల క్రితం ఈ ఆటోమేకర్, ఈ రెండు ఎస్యువిల కోసం వేచి చూస్తున్న వారితో పాటు అందరిని వాటి సేఫ్టీ రేటింగ్ ను వెల్లడించి ఆశ్చర్యపోయేలా చేసింది.
కొత్త సఫారికి మరియు కొత్త హారియర్ కు గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా 5-స్టార్ రేటింగ్ లభించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో కొత్త సఫారికి 34 పాయింట్లకు 33.05 పాయింట్స్ స్కోర్ లభించగా, హారియర్ కు కూడా అదే స్కోరు లభించింది. ఇక చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో సఫారికి 49 పాయింట్లకు 45 పాయింట్స్ స్కోర్ లభించగా, హారియర్ కు కూడా అదే స్కోరు లభించింది.
ఈ సందర్భంగా గ్లోబల్ ఎన్ క్యాప్ సెక్రెటరీ జనరల్ అలెజాండ్రో ఫురస్ స్పందిస్తూ “టాటా నుంచి వచ్చిన ట్విన్ మోడల్స్ కొత్త టాటా సఫారి మరియు హారియర్ కు గ్లోబల్ ఎన్ క్యాప్ ద్వారా 5-స్టార్ రేటింగ్ లభించడంతో వారికి అభినందనలు తెలుపుతున్నాం. టాప్ అడల్ట్ మరియు చైల్డ్ సేఫ్టీ రేటింగ్ తో ఇలాంటి స్ట్రాంగ్ రిజల్ట్ పొందడం, అలాగే టాటా కంపెనీ సేఫ్ వెహికిల్స్ ని ఉత్పత్తి చేయడం వారి నిబద్ధతను సూచిస్తుంది, దీన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్