టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు ప్రవేశించింది
టాటా మోటార్స్ భారతదేశంలో కొత్త హారియర్ ఫేస్‌లిఫ్ట్‌ను 17 అక్టోబర్, 2023న లాంచ్ చేసింది. పాపులర్ ఎస్‌యువి, పెద్దగా ఎలాంటి మెకానికల్ మార్పులు లేకుండా భారీ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ మార్పులతో వచ్చింది. ఇది 7 కలర్స్ ఆప్షన్ తో 10 వేరియంట్స్ లో ప్రారంభ ధర రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)లో పొందవచ్చు. భారతీయ ఆటోమేకర్ ఫ్లాగ్‌షిప్ 5-సీట్స్ ఎస్‌యువి కొత్త వేరియంట్‌లతో అందించడానికి వివిధమైన సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్స్ తో వచ్చింది . ఈ కథనంలో, 2023 టాటా హారియర్‌ను మీరు ఎందుకు కొనుగోలు చేయాలో మేము మీకు వెల్లడిస్తాము.
న్యూ టాటా హారియర్‌లో ఏ విషయాలు తప్పక తెలుసుకోవాలి ?
ఫేస్‌లిఫ్ట్ ద్వారా, టాటా హారియర్ కొత్త పవర్, కొత్త కలర్స్, ఫీచర్స్ ను పొందింది మరియు మునుపటి కంటే స్పోర్టివ్‌గా కనిపిస్తుంది. ఎస్‌యువి సన్‌లిట్ ఎల్లో, కోరల్ రెడ్, పెబల్ గ్రే, లూనార్ వైట్, ఒబెరాన్ బ్లాక్, సీవీడ్ గ్రీన్ మరియు యాష్ గ్రే అనే 7 కలర్స్ లో అందుబాటులో ఉంది. సన్ లైట్ ఎల్లో మాకు పర్సనల్ గా ఇష్టమైన కలర్. కొత్త పారామెట్రిక్ స్ప్లిట్ గ్రిల్‌తో, ఈ ప్రకాశవంతమైన రంగు కొత్త హారియర్ ను అగ్రెసివ్ గా మరింత అద్భుతంగా కనిపించేలా చేస్తుంది.
ముందుగా ఎక్విప్‌మెంట్ గురించి చెప్పాలంటే , అప్‌డేట్ చేయబడిన హారియర్ 10-స్పీకర్ జెబిఎల్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్‌తో పెద్ద 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నావిగేషన్ సపోర్ట్‌తో కూడిన ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్- కంట్రోల్డ్ హెచ్‍విఏసి ప్యానెల్ వంటి ఫీచర్స్ తో లోడ్ చేయబడింది. ప్రకాశవంతమైన లోగోతో 4-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఇది ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ మూడ్ లైటింగ్, జ్యువెల్డ్ టెర్రైన్ రెస్పాన్స్ సెలెక్టర్, పవర్డ్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్-వరుసలో సీట్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం మరియు పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా కలిగి ఉంది.
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ సేఫ్ కారు అని చెప్పవచ్చా?
న్యూ టాటా హారియర్ మొత్తం మీద ఒక గొప్ప ప్రోడక్ట్ అని చెప్పవచ్చు, అయితే మా మొదటి డ్రైవ్ రివ్యూలో మేమ చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నాము. సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే, హారియర్ 7 ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, హిల్ డిసెంట్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, టిపిఎంఎస్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరాలను కలిగి ఉంటుంది. బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, అప్‌డేట్ చేయబడిన ఏడిఏఎస్ సూట్ మరియు ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అద్బుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. జిఎన్‍క్యాప్ క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్స్‌లో కొత్త హారియర్ కు 5-స్టార్ రేటింగ్ లభించింది.
సాధారణ సమస్యల విషయానికి వస్తే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మరియు పోర్ట్‌లు ఇబ్బందికరంగా మరియు యాక్సెస్ చేయడానికి కష్టంగా ఉండవచ్చు. ఫిట్ మరియు ఫినిషింగ్ సెంటర్ కన్సోల్ ఏరియా మరియు డోర్ ప్యాడ్స్ చుట్టూ అస్థిరంగా ఉంటాయి, ఇవి మరింత మెరుగ్గా ఉండాల్సింది. అలాగే, మాన్యువల్ గేర్‌బాక్స్ నాచీగా ఉండి మరియు సరైన గేర్‌లోకి స్లాట్ చేయడం కూడా మనం అనుకున్నంత సులభం ఏం కాదు. పోటీలో ఉన్న వాటితో పోలిస్తే, టాటా మోటార్స్ ఎస్‌యువి డ్యూయో డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందిస్తుంది. ఎలా అయితే ఏంటి,రాబోయే సంవత్సరంలోటర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా హారియర్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది.
సాధారణ సమస్యల విషయానికి వస్తే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ మరియు పోర్ట్‌లు ఇబ్బందికరంగా మరియు యాక్సెస్ చేయడానికి కష్టంగా ఉండవచ్చు. ఫిట్ మరియు ఫినిషింగ్ సెంటర్ కన్సోల్ ఏరియా మరియు డోర్ ప్యాడ్స్ చుట్టూ అస్థిరంగా ఉంటాయి, ఇవి మరింత మెరుగ్గా ఉండాల్సింది. అలాగే, మాన్యువల్ గేర్‌బాక్స్ నాచీగా ఉండి మరియు సరైన గేర్‌లోకి స్లాట్ చేయడం కూడా మనం అనుకున్నంత సులభం ఏం కాదు. పోటీలో ఉన్న వాటితో పోలిస్తే, టాటా మోటార్స్ ఎస్‌యువి డ్యూయో డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందిస్తుంది. ఎలా అయితే ఏంటి, రాబోయే సంవత్సరంలోటర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా హారియర్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది.
కొనుగోలు చేయడానికి టాటా హారియర్ లో ఏది సరైన వేరియంట్ ?
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ స్మార్ట్ (O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ +, అడ్వెంచర్ + డార్క్, అడ్వెంచర్ + A,ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ డార్క్, ఫియర్‌లెస్ + మరియు ఫియర్‌లెస్ + డార్క్ అనే 10 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటిలో, అడ్వెంచర్ రేంజ్ సరైన వేరియంట్స్ అని చెప్పవచ్చు , ఎందుకంటే దీని ధరల రేంజ్ రూ.20.19లక్షల నుండి రూ. 24.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ ధరల రేంజ్ లో వివిధమైన కొత్త ఫీచర్‌లను ఇందులో పొందవచ్చు. ముఖ్యంగా, కస్టమర్‌లు అడ్వెంచర్ వేరియంట్స్ లో డార్క్ ఎడిషన్‌ను రూ.22.24లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
అప్ డేటెడ్ హారియర్ ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్
క్రింది హుడ్ లో, న్యూ టాటా హారియర్ మొదటగా ఉన్న ఇటరేషన్ లాగే 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ బిఎస్6 2.0-కంప్లైంట్ కు అనుగుణంగా మరియు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి 168bhp మరియు 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు:రాజపుష్ప