- ఇండియాలో రూ. 15.49లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ధరలు ప్రారంభం
- ఇందులో పవర్డ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ప్రత్యేకం
టాటా మోటార్స్ ఇండియాలో హారియర్ ను సరికొత్తగా డిజైన్ చేసింది. ఈ ఎస్‌యూవీ ధరలు రూ. 15.49 లక్షల నుండి రూ. 24.49 లక్షలు వరకు (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. మేము వీటికి సంబంధించి ప్రత్యేకంగా అప్‌డేట్ చేయబడిన మోడల్ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్నాము.
ప్రస్తుతం, హారియర్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ పై వెయిటింగ్ పీరియడ్ బుక్ చేసిన తేదీ నుంచి 6 నుండి 8 వారాల వరకు ఉంటుంది. కానీ, ఇది ముంబైలో చేసిన బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది మరియు ఈ వెయిటింగ్ పీరియడ్ డీలర్‌షిప్, వేరియంట్, కలర్, గేర్‌బాక్స్ ఆప్షన్స్ మరియు ఇతర అంశాలను బట్టి మారవచ్చు. దీని గురించి మరింత తెలుసుకోవడానికి మీకు దగ్గర లో ఉన్న అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించమని మేము మీకు సూచిస్తున్నాము.
ఫీచర్స్ పరంగా చూస్తే, హారియర్ వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ఇంటర్‌ఫేస్ సపోర్టెడ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, జెఎల్ఆర్-ఇన్ స్పైర్డ్ గేర్ లీవర్ ను పొందింది మరియు డ్రైవ్ మోడ్‌ల కోసం కొత్త డయల్‌తో లోడ్ చేయబడింది. అదనంగా, ఇది టచ్-బేస్డ్ హెచ్ విఏసి కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ పవర్డ్ ఫ్రంట్ సీట్‌లను కూడా కలిగి ఉంది .
అప్‌డేటెడ్ హారియర్ పవర్డ్ 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ 168bhp మరియు 350Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ నుండి ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప