- 7 కలర్స్ మరియు 10 వేరియంట్స్ లో అందుబాటులో ఉన్న హారియర్ ఫేస్ లిఫ్ట్
- ఇందులో 168 bhpని ఉత్పత్తి చేసే పవర్డ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ప్రత్యేకం
టాటా మోటార్స్ కొత్త హారియర్ ను ఇండియాలో అధికారికంగా లాంచ్ చేసింది, దీని ధరలు రూ.15.49 లక్షలు(ఎక్స్-షోరూం)నుండి ప్రారంభంకానున్నాయి. కొత్త హారియర్ కు గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా 5-స్టార్ రేటింగ్ లభించింది. ఈ మోడల్ కు సంబంధించిన బుకింగ్స్ ఈ నెలలో ప్రారంభించగా, ఇది మొత్తం 10 వేరియంట్స్ లో 7 కలర్స్ లో అందుబాటులో ఉంది.
టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్
డిజైన్ గురించి చెప్పాలంటే, కొత్త హారియర్ లో కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ప్రొజెక్టర్ ల్యాంప్స్ కోసం ట్రయాంగులర్ హౌసింగ్, ఫ్రంట్ మరియు రియర్ సైడ్ ఎల్ఈడీ లైట్ బార్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, కొత్త 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
ఫేస్ లిఫ్టెడ్ హారియర్ ఇంటీరియర్ మరియు ఫీచర్స్
లోపల చూస్తే, అప్ డేటెడ్ టాటా హారియర్ 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 10.25-ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, రియర్ సన్ షేడ్స్, మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది. అలాగే ఇందులో జెస్చర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్ గేట్, ఐఆర్ఎ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఎడిఎఎస్ సూట్, రెండవ వరుసలో సౌకర్యంగా కూర్చోవడానికి కంఫర్ట్ హెడ్ రెస్ట్స్, 360-డిగ్రీ కెమెరా మరియు ప్యాడిల్ షిఫ్టర్స్ ను కూడా కలిగి ఉంది.
2024 టాటా హారియర్ కలర్స్ మరియు వేరియంట్స్
కలర్స్ పరంగా చూస్తే, కొత్త హారియర్ ఫేస్ లిఫ్ట్ 7 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. అవి – సన్ లిట్ ఎల్లో, కోరల్ రెడ్, పెబల్ గ్రే, లునార్ వైట్, ఒబెరాన్ బ్లాక్, సీవీడ్ గ్రీన్, మరియు యాష్ గ్రే. అలాగే దీనిని 10 వేరియంట్స్ లో పొందవచ్చు. అవి ఏవి అంటే, స్మార్ట్(O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ +, అడ్వెంచర్ + డార్క్, అడ్వెంచర్+ ఎ, ఫియర్ లెస్, ఫియర్ లెస్డార్క్, ఫియర్ లెస్+, మరియుఫియర్ లెస్+ డార్క్. వేరియంట్స్ వారీగా ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలు కోసం మా వెబ్ సైట్ ను సందర్శించి, చూడవచ్చు.
కొత్త టాటా హారియర్ ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్
రీఫ్రెష్ లుక్ తో వస్తున్న టాటా హారియర్ 2.0-లీటర్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ తో 4-సిలిండర్ క్రియోటెక్ ఇంజిన్, ఈ మోటార్, 168bhp మరియు 350Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తూ ఇంతకు ముందున్న వెర్షన్స్ తో పోలిస్తే మరింత ఎక్కువగా మైలేజ్ ఇవ్వనుంది.
టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్ ధరలు
కొత్త హారియర్ కు సంబంధించి వేరియంట్ వారీగా ధరలు కింద ఇవ్వబడ్డాయి
(అన్నీ ధరలు, ఎక్స్-షోరూం):
వేరియంట్ | ఎక్స్ షోరూం ధర (లక్షలు) |
స్మార్ట్ ఎంటి | రూ.15.49 లక్షలు |
ప్యూర్ ఎంటి ప్యూర్ + ఎంటి ప్యూర్ + ఆటోమేటిక్ | రూ.16.99 లక్షలు, రూ.18.69 లక్షలు, రూ.19.99 లక్షలు నుండి ప్రారంభం |
అడ్వెంచర్ ఎంటి | రూ.20.19 లక్షలు |
అడ్వెంచర్ + ఎంటి | రూ.21.69 లక్షలు |
అడ్వెంచర్ + డార్క్ | రూ.19.99 లక్షలు నుండి ప్రారంభం |
అడ్వెంచర్+ ఆటోమేటిక్ | రూ.19.99 లక్షలు నుండి ప్రారంభం |
ఫియర్ లెస్ ఫియర్ లెస్ ఆటోమేటిక్ | రూ.22.99 లక్షలు, రూ.19.99 లక్షలు నుండి ప్రారంభం |
ఫియర్ లెస్ డార్క్ | రూ.19.99 లక్షలు నుండి ప్రారంభం |
ఫియర్ లెస్+ ఫియర్ లెస్+ ఆటోమేటిక్ | రూ.24.49 లక్షలు, రూ.19.99 లక్షలు నుండి ప్రారంభం |
ఫియర్ లెస్+ డార్క్ | రూ.19.99 లక్షలు నుండి ప్రారంభం |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్