- ఈ ఆర్ధిక సంవత్సరంలో లాంచ్ అవుతున్నట్లు నిర్దారించిన టాటా కంపెనీ
- కర్వ్ ఈవీతో పాటుగా పవర్ ట్రెయిన్ ని షేర్ చేసుకోవచ్చని అంచనా
స్టోరీలోకి వెళ్లకముందు ముందుగా మనం ఎడబ్లూడీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎడబ్లూడీ అంటే కారు ఇంజిన్ నాలుగు వీల్స్ కి సమానంగా పవర్ ని సప్లై చేయడం. ఆల్ వీల్ డ్రైవ్ ని ఎడబ్లూడీ అని కూడా అంటారు. టాటా కంపెనీ ఎడబ్లూడీ(ఆల్ వీల్ డ్రైవ్) వేరియంట్ ని తీసుకువస్తున్నట్లు లేటెస్టుగా ప్రకటించింది. ఇప్పుడు టాటా హారియర్ ఈవీ ఎడబ్లూడీ(ఆల్ వీల్ డ్రైవ్) వేరియంట్ తో కనిపించగా, దీని డెవలప్ మెంట్ ఇప్పుడు మరొక కొత్త మలుపు తిరిగింది. హారియర్ ఈవీ ఇప్పుడు టాటా నుంచి అతిపెద్ద ఈవీగా రానుండగా, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రపంచంలో టాటా కంపెనీ దాని జర్నీని మొదలుపెట్టి సరిగ్గా నాలుగేళ్లు అవుతుంది.
2023 ఆటో ఎక్స్ పోలో మొదటిసారి కనిపించగా, మరోసారి 2024 భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో అప్ డేటెడ్ వెర్షన్లో కనిపించింది. టాటా నుంచి ఫ్లాగ్ షిప్ ఎస్‍యూవీ ఆర్థిక సంవత్సరం-2025లో 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించే మోడల్ గ వస్తుందని భావిస్తుండగా, 2023 హారియర్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ ని పోలి ఉండే అవకాశం ఉంది. ఇందులో లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్), 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, మరియు ఈవీ-స్పెసిఫిక్ ఫీచర్లతో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. టాటా కార్లు ఇప్పుడు అన్నింటిని బ్రేక్ చేస్తూ ఒక కొత్త జంక్షన్ నుంచి హారియర్ ఈవీతో పాటుగా కొత్త ప్రొడక్టును తీసుకురానుండగా, దీని ద్వారా టాటా కంపెనీ మరో ముందడుగు వేయనుంది.
హారియర్ ఈవీ తర్వాత సఫారీ ఈవీ రానుండగా, దాని తర్వాత 2026 ఆర్థిక సంవత్సరంలో సియెరా ఈవీ వస్తుందని మేము భావిస్తున్నాము. దీని ద్వారా టాటా ఈవీ కార్లు ఎంజి, హ్యుందాయ్, కియా, హోండా, మారుతి, మరియు టయోటా బ్రాండ్ల ఈవీ కార్లతో పోటీపడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్