- భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించబడిన టాటా హారియర్ ఈవీ
- సీవీడ్ గ్రీన్ అనే కొత్త కలర్ లో కనిపిస్తున్న హారియర్ ఈవీ
టాటా కంపెనీ హారియర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను భారత్ మొబిలిటీ షోలో మొదటిసారిగా ప్రదర్శించింది. ఫోటోలను చూస్తే, ఈ టాటా వెహికిల్ ప్రొడక్షన్-రెడీ లుక్ లో కనిపిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, సేఫ్టీ పరంగా టాటా కంపెనీ హారియర్ ఈవీలో కొత్త ఏడీఏఎస్ఫీచర్లను అందించనుంది.
హారియర్.ఈవీని భారత్ మొబిలిటీ షోలో టాటా.ఈవీ స్టాల్‌లో ప్రదర్శించారు, ఇక్కడ ఎస్‍యూవీని గమనిస్తే, ఫ్రంట్ బంపర్ యొక్క వర్టికల్ స్లాట్ గ్రిల్‌పై రాడార్ కనిపిస్తుంది. హారియర్.ఈవీలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం అందించబడుతుందని ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు హారియర్.ఈవీ కేవలం వైట్ కలర్లో మాత్రమే కనిపించేది, భారత్ మొబిలిటీ షోలో సీవీడ్ గ్రీన్ అనే కొత్త కలర్లో కనిపించింది.దీని ఐసీఈ వెర్షన్ ఇప్పటికే ఈ కలర్లో అందుబాటులో ఉంది.
హారియర్.ఈవీలో లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్) ఫీచర్స్
2023 హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇదివరకే లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్) ఫీచర్స్ ఉన్నాయి. అయితే, ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో ఇ బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా, ఇదిటాటా సఫారి లెవెల్-2ఏడీఏఎస్ (అడాస్) ఫీచర్స్ ని కలిగి ఉంది, అయితే టాటా యొక్క మోస్ట్ పాపులర్ నెక్సాన్ లెవెల్-1ఏడీఏఎస్ (అడాస్)సూట్‌ను కలిగి ఉంది.
హారియర్.ఈవీ కూడా ఐసీఈవెర్షన్ లాగానే లెవెల్-2ఏడీఏఎస్ (అడాస్) ఫీచర్స్ ని పొందుతుందని మేము భావిస్తున్నాము. ఇది లెవెల్-2ఏడీఏఎస్ (అడాస్) ఫీచర్స్ తో టాటా నుంచి వస్తున్న మొదటి ఈవీ కానుంది.
టాటా నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కార్లు
టాటా నుండి వస్తున్న ఈ 5-సీటర్ ఈవీ కూడాపంచ్ ఈవీ లాగేబ్రాండ్ యొక్క కొత్త సెకండ్ జనరేషన్, ఒమేగా ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది, దీనికి యాక్టి.ఈవీఅని పేరు పెట్టారు. ఈ ఇండియన్ కార్ మేకర్ వచ్చే ఏడాదిలో టాటా హారియర్.ఈవీని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయవచ్చు. అంతే కాకుండా, కంపెనీ సియెర్రా ఎలక్ట్రిక్ వెర్షన్‌పై కూడా పనిచేస్తోంది. టాటా యొక్క కొత్త ఫుల్లీ ఎలక్ట్రిక్ కార్లు అయిన కర్వ్ మరియు అవిన్య కూడా త్వరలో ఇండియన్ మార్కెట్లో ప్రవేశించే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్