- 2024 చివరలో ఇండియాలో హారియర్ ఈవీ ధరలు ప్రకటించే అవకాశం
- 500కిమీ రేంజ్ ని పొందనున్న ఈవీ
2024 సంవత్సరం చివరలో హారియర్ ఈవీ లాంచ్ జరగనుండగా, దాని కంటే ముందు హారియర్ ఈవీ డిజైన్ కి సంబంధించిన అధికారిక (పేటెంట్) ఫోటోలు ఇంటర్నెట్లో లీకై హల్చల్ చేస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ హారియర్ ఒకే ఒక్క ఫుల్ చార్జ్ తో 500కిమీ రేంజ్ ని ఇవ్వవచ్చని గత నెలలో ఇదివరకే మేము పేర్కొన్నాము.
ఇక్కడ ఉన్న లీకైన ఫోటో చూస్తే, ఎక్స్‌టీరియర్ డిజైన్ పరంగా హారియర్ ఈవీని దాని ఐసీఈ వెర్షన్ తో పోలిస్తే భారీ మార్పులతో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఫోటోలో ఉన్న తేడాలను గమనిస్తే, హారియర్ ఈవీ కొత్త సెట్ ఏరో అల్లాయ్ వీల్స్ తో పాటుగా ఫ్రంట్ డోర్ పై ‘.EV’ బ్యాడ్జింగ్ ని కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇది బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్ తో రివైజ్డ్ ఫాసియా మరియు ట్వీక్డ్ ఫ్రంట్ బంపర్ ని పొందవచ్చు.
ఫీచర్స్ పరంగా, రాబోయే హారియర్ ఈవీ ఏడీఏఎస్ (అడాస్) సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పనోరమిక్ సన్‍రూఫ్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, జ్యూవెల్డ్ గేర్ డయల్, మరియు 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ తో వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కారు యొక్క స్పెసిఫికేషన్స్ మరియు పవర్ ట్రెయిన్ వివరాల గురించి టాటా కంపెనీ పేర్కొనలేదు. లాంచ్ అయిన తర్వాత, హారియర్ ఈవీ హ్యుందాయ్ క్రెటా ఈవీ మరియు హోండా ఎలివేట్ ఈవీతో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్