- 2024 భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో ప్రదర్శించబడిన హారియర్ ఎలక్ట్రిక్ వెర్షన్
- సఫారీ ఈవీతో పాటుగా వచ్చే అవకాశం
టాటా కంపెనీ రెండు మోటార్ షోలలో ఫ్లాగ్ షిప్ 5-సీట్ ఎస్‍యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన హారియర్ ఈవీని ప్రదర్శించడం ద్వారా దీనికి సంబంధించిన కొన్ని వివరాలను అందించింది. ఇప్పుడు, ఈ హారియర్ ఈవీని టాటా ఎప్పుడు లాంచ్ చేస్తున్నదో కూడా ప్రకటించేసింది. అది ఎప్పుడు అంటే, ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోపు లాంచ్ చేయనుంది. అనగా ఈ కారును మనం మార్చి-2025లోపు చూడవచ్చు.
మొదటిసారిగా ఇది 2023 ఆటో ఎక్స్ పోలో తళుక్కున మెరవగా, దాని సెకండ్ ఇటరేషన్ అక్టోబర్-2023లో జరిగిన 2024 భారత్ మొబిలిటీ ఎక్స్ పో వద్ద హారియర్ ఫేస్‍లిఫ్ట్ తో పాటుగా కనిపించింది. ఈ కాన్సెప్ట్ కారు సీట్లు, స్క్రీన్లు, వీల్స్ డిజైన్ మరియు రియర్ రూఫ్ లైన్ వంటి ఫీచర్ అప్ డేట్ల ద్వారా స్పోర్ట్ లుక్ ని కలిగి ఉంది. కర్వ్ ఈవీలో ఉన్న పవర్ ట్రెయిన్లతో హారియర్ ఈవీ వచ్చే అవకాశం ఉందని భావిస్తుండగా, ఇది అందించే అధిక అవుట్ పుట్ కారణంగా కర్వ్ ఈవీ కంటే ఖరీదైన కారుగా ఈ మోడల్ రానుంది.
హారియర్ ఈవీ సఫారీ ఈవీతో పాటుగా వస్తుందని మేము నమ్మకంగా ఉన్నాము, వేగవంతంగా విస్తరిస్తున్న ఈవీ సెగ్మెంట్‌లో హారియర్ ఈవీ మరియు సఫారీ ఈవీల ద్వారా వివిధ ఆప్షన్లను కలిగి ఉండటం టాటా కంపెనీ ముందు చూపుగా చెప్పవచ్చు. లాంచ్ అయిన తర్వాత, ఈ మోడల్ మారుతి eVX మరియు టయోటా అర్బన్ స్పోర్ట్ వంటి కార్లతో పాటుగా మహీంద్రా, హ్యుందాయ్ మరియు హోండా వంటి ఎలక్ట్రిక్ కార్లతో కూడా పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్