- రూ.25 వేలతో బుకింగ్స్ ప్రారంభం
- ఇందులో ప్రత్యేకంగా పవర్డ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్
టాటా మోటార్స్ మొత్తానికి టాటా హారియర్ మరియు సఫారి ఫేస్‍లిఫ్ట్స్ ధరలను రేపు అనగా అక్టోబర్ 17న ప్రకటించనుంది. ఈ రెండు ఎస్‍యూవీలు ఇండియాలో లాంచ్ అయినప్పటినుంచి ఇదే ప్రధాన అప్ డేట్ అని చెప్పవచ్చు. రూ. 25,000 టోకెన్ అమౌంట్ తో ఈ అప్ డేటెడ్ ఎస్‍యూవీలను బుక్ చేసుకోవడం జరుగుతుంది. హారియర్ ఫేస్‍లిఫ్ట్ మరియు సఫారి ఫేస్‍లిఫ్ట్ లను మేము ఇంతకు ముందే డ్రైవ్ చేసిన వీడియోలు మరియు రివ్యూలు మా వెబ్ సైట్ లో మరియు యూట్యూబ్ ఛానెల్ లో అందుబాటులో ఉన్నాయి.
ఫేస్‍లిఫ్టెడ్ హారియర్ ను కస్టమర్స్ 10 వేరియంట్స్ నుండి సెలెక్ట్ చేసుకోవచ్చు. అవేవి అంటే స్మార్ట్(O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ +, అడ్వెంచర్ + డార్క్, అడ్వెంచర్+ ఎ, ఫియర్ లెస్, ఫియర్ లెస్డార్క్, ఫియర్ లెస్+, మరియుఫియర్ లెస్+ డార్క్. మరోవైపు, కొత్త సఫారి కూడా స్మార్ట్(O), ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ +, అడ్వెంచర్ + డార్క్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ డార్క్, అకాంప్లిష్డ్ + డార్క్, అడ్వెంచర్ + ఎ, మరియు అకాంప్లిష్డ్+ అనే 10 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
ఈ ఎస్‍యూవీలో ప్రధాన భాగమైన 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ 168bhp మరియు 350Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తూ, ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని అందిస్తుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులను 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ నిర్వహిస్తాయి.
హారియర్ ఫేస్‍లిఫ్ట్ ఎంజి హెక్టర్, హ్యుందాయ్ క్రెటా, జీప్ కంపాస్, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్ వ్యాగన్ టైగున్ లతో పోటీ పడనుంది. అదే విధంగా చూస్తే, అప్ డేటెడ్ సఫారి మహీంద్రా ఎక్స్‌యూవీ700, మహీంద్రా స్కార్పియో ఎన్, టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా ఇన్నోవా క్రిస్టా, ఎంజి హెక్టర్ ప్లస్, మరియు హ్యుందాయ్ ఆల్కాజార్ లతో పోటీ పడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్