2024లో టాటా నుంచి అతి పెద్ద ఐసీఈ లాంచ్ సెప్టెంబర్ 2వ తేదీన జరగనుండగా, దీంతో పాటుగా వీటి ధరలను కూడా టాటా ప్రకటించనుంది. దీని రాక కంటే ముందుగా టాటా కర్వ్ కొలతల పరంగా దీని సెగ్మెంట్లో ఉన్న వివిధ కార్లతో పోటీపడుతుంది. టాటా కర్వ్ తో పాటుగా ఇతర కార్ల తయారీ సంస్థల నుంచి కార్ వాలే గ్యారేజీకి వచ్చిన వీటిపై కాంప్రహెన్సివ్ టెస్ట్ నిర్వహించగా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందిస్తున్నాము.
కొలతలు (ఎంఎం) | కర్వ్ | క్రెటా | సెల్టోస్ | ఆస్టర్ | గ్రాండ్ విటారా | హైరైడర్ | ఎలివేట్ |
పొడవు | 4,308 | 4,330 | 4,365 | 4,332 | 4,345 | 4,345 | 4,312 |
వెడల్పు | 1,810 | 1,790 | 1,800 | 1,809 | 1,795 | 1,795 | 1,790 |
ఎత్తు | 1,630 | 1,635 | 1,635 | 1,650 | 1,645 | 1,645 | 1,650 |
వీల్ బేస్ | 2,560 | 2,610 | 2,610 | 2,585 | 2,600 | 2,600 | 2,650 |
కొలతల మధ్య పోలిక
ఒకవేళ మీరు వీటి కొలతలను పరిశీలిస్తే, ఓవరాల్ గా పొడవును బట్టి అన్నింటికంటే టాటా కర్వ్ కారు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. దాని తర్వాతి స్థానంలో హోండా ఎలివేట్ ఉంది. ఈ పోటీలో వెడల్పును బట్టి, పెద్ద పెద్ద కార్లను కాదని ఇదే విశాలమైన కారుగా నిలిచింది. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, దీని ఎత్తు కొంచెం తక్కువగా ఉంది. కూపే ఎస్‍యూవీ డిజైన్ కొలతల పరంగా సరిపోయింది. ఫైనల్ గా, వీల్ బేస్ పరంగా, టాటా కర్వ్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఎందుకంటే ఇది హోండా ఎలివేట్ కంటే తక్కువ వీల్ బేస్ ని కలిగి ఉంది. అంతే కాకుండా, ఏ విషయంలో అయినా టాటా కర్వ్ తో పోలిస్తే హోండా ఎలివేట్ దే పైచేయి అని చెప్పవచ్చు.
బాడీ స్టైల్ పరంగా అన్ని కార్ల కంటే ముందున్న కర్వ్
కొలతల పరంగా, ఇతర కార్లతో పోలిస్తే ఇది మధ్య స్థానంలో పొజిషన్ చేయబడగా, టాటా నుంచి వచ్చిన కర్వ్ కారు బాడీ స్టైల్ పరంగా అన్ని కార్ల కంటే ముందుంది. కేవలం కర్వ్ కారు మాత్రమే ఐసీఈ మరియు ఈవీ వెర్షన్ల పరంగా ఒకే రకమైన షేప్ ని కలిగి ఉంది. ఇతర కార్లతో పోలిస్తే, కర్వ్ లోని రెండు వెర్షన్లు ఒకేలా ఉంటాయి.
ఫీచర్లు మరియు పవర్ ట్రెయిన్స్
టాటా కంపెనీ కంఫర్ట్ మరియు ఫీల్-గుడ్ ఫీచర్ల పరంగా దాని క్యాటలాగ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ ని అందించి ఇతర కార్లపై పైచేయి సాధించింది. అయితే, పోటీని చూస్తే, దీనితో పోటీ పడే కారు ఏ ఒక్కటీ లేదంటే నమ్మండి, అంతలా దీనిలో ఫీచర్లను అందించింది. నిజం చెప్పాలంటే, బాడీ స్టైల్ పై ఎక్కువ దృష్టి సారించి టాటా చాలా సేఫ్ గేమ్ ఆడుతుందని అని చెప్పవచ్చు.
చివరగా, పవర్ ట్రెయిన్ల గురించి చెప్పాలంటే, కర్వ్ ద్వారా టాటా డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టగా, ఇందులో కియా, హ్యుందాయ్ వంటి ఆటోమేకర్లు ఉన్నాయి. భవిష్యత్తులో మహీంద్రా కంపెనీ కూడా ఈ సెగ్మెంట్లోకి వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్