కూపే ఎస్‍యూవీ సెగ్మెంట్ ఎఫెక్ట్ ఇప్పుడు బడ్జెట్ విభాగానికి కూడా చేరుకుంది మరియు రెండు బలమైన ప్రత్యర్థులుగా ఉన్నటాటా కర్వ్ మరియు సిట్రోన్ బసాల్ట్ ఈ రేసులోకి అడుగుపెట్టాయి. ఒక వైపు, టాటా కర్వ్ మొదట కాన్సెప్ట్‌గా పరిచయం చేయబడగా, ఇప్పుడు ఇది సెప్టెంబర్ 2 నుండి రోడ్లపై కనిపించనుంది. మరోవైపు,సిట్రోన్ బసాల్ట్ ఉంది, ఇది ఇండియాలో ఫ్రెంచ్ బ్రాండ్ నుండి నాలుగవ మోడల్ గా అందించబడుతుండగా, ఇది కేవలం రూ. 7.99 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. దీని టాప్ మోడల్ ధర రూ.13.62 లక్షలుగా ఉంది.
డిజైన్: ఫ్రెంచ్ స్టైల్ వర్సెస్ దుర్భేధ్యమైన లుక్
సిట్రోన్ బసాల్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్ క్లాసిక్ గా, షార్ప్ లైన్లతో, భారీ కొలతలు మరియు సైడ్ ప్రొఫైల్ నుండి పొడవుగా ఉండే లుక్ ఫ్రెంచ్ స్టైల్ ని కలిగి ఉంది. ఈ కూపే ఎస్‍యూవీ కొంచెం సెడాన్ లాగా కనిపిస్తుంది, కారువెనుక వైపున, స్క్వేర్ టెయిల్ లైట్లు దీనికి ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చాయి. బూట్ డోర్‌లో స్లోపింగ్ గ్లాస్ హౌస్ చాలా చక్కగా అందించడంతో, దీని స్టైల్ మరింత అద్భుతంగా కనిపిస్తుంది.
టాటా కర్వ్ డిజైన్ బోల్డ్ గా మరియు కండలు తిరిగినట్లు అనిపిస్తుంది. లోయర్ హెడ్‌లైట్లు మరియు పెద్ద టాటా గ్రిల్ దీనికి పవర్ లుక్ ని అందిస్తాయి. సైడ్ ప్రొఫైల్ చూస్తే, కర్వ్ ఒక పొడవుగా బెస్ట్ లుక్ ని కలిగి ఉంది.వెనుక భాగంలో, కర్వ్ కారు స్పాయిలర్, వన్-పీస్ లైట్ బార్ మరియు ఫ్లాట్ స్లోపింగ్ రూఫ్‌లైన్ వంటి ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
సైజ్ మరియు డైమెన్షన్లు: దేని సైజ్ పెద్దగా ఉంది?
సిట్రోన్ బసాల్ట్ పొడవు 4.35 మీటర్లు కాగా, ఇది ఈ సెగ్మెంట్లో స్టాండర్డ్ ఆప్షన్ అందించబడింది. కానీ దాని వీల్‌బేస్ 2.65 మీటర్లు ఉండడంతో, దీనికి పోటీగా ఉన్న మోడల్స్ కంటే ఇది కొంచెం వేరుగా కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే, ఇది పొడవైన వీల్‌బేస్ ని కలిగి ఉంది.
టాటా కర్వ్ 4.30 మీటర్ల పొడవును కలీ ఉంది, ఇది దీనికి పోటీగా ఉన్న కార్లకు తగిన పొడవును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 2.56 మీటర్లు ఉండడంతో ఇతర వెహికిల్స్ కంటే బెటర్ పొజిషన్ లో ఉంది.
ఫీచర్లు: ఏ కారులో ఎక్కువ ఫీచర్లు లభిస్తాయి ?
ఫీచర్ల గురించి చెప్పాలంటే, సిట్రోన్ బసాల్ట్ కారు క్లైమేట్ కంట్రోల్, రివర్స్ కెమెరా, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్, పవర్ మిర్రర్స్, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ముందు మరియు వెనుక ఆర్మ్‌రెస్ట్స్, స్ప్లిట్ ఫోల్డింగ్ రియర్ సీట్లు, ఎల్ఈడీహెడ్‌లైట్లు మరియు 16-ఇంచ్ వీల్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
టాటా కర్వ్ లెవెల్-2 ఎడాస్, 360-డిగ్రీ కెమెరా, పవర్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు పవర్ బూట్ ఓపెనింగ్‌తో పాటు బసాల్ట్ లో ఉన్న అన్ని ఫీచర్లను కూడా కలిగి ఉంది. దీంతో వీటి మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రెండు వెహికిల్స్ 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్స్ స్టాండర్డ్ గా ఉన్నాయి.
ఇంజిన్ ఆప్షన్లు: ఏది మోస్ట్ పవర్ ఫుల్ ఇంజిన్ ని కలిగి ఉంది ?
సిట్రోన్ బసాల్ట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. మొదటిది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కాగా, ఇది 82bhp/115Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. రెండవది 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కాగా, ఇది 109bhp మరియు 190Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఎంటిమరియు టర్బో వెర్షన్‌లలో వేరు వేరు టార్క్ నంబర్లను అందిస్తుంది.
ఇంజన్ ఆప్షన్లను చూస్తే, టాటా కర్వ్ ఇందులో చాలా ముందుంది. ఇందులో మూడు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్, ఇది 118bhp/170Nmటార్కునుఉత్పత్తి చేస్తుంది. రెండవది కొత్త హైపీరియన్ జిడిఐటర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 123bhp/225Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, టాటా కర్వ్‌లో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది, ఇది 116bhp/260Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని డీజిల్ ఇంజన్ ని 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి పొందవచ్చు. దీని ద్వారాఇది ఈ సెగ్మెంట్‌లో ప్రత్యేకమైనదిగా నిలిచింది.
ధర: ఏ కారు తక్కువ ధరతో లభిస్తుంది ?
సిట్రోన్ బసాల్ట్ ఎక్స్-షోరూంప్రారంభ ధర రూ. 7.99 లక్షలు ఉండగా, ఇది కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజామరియు మహీంద్రా XUV 3XO వంటి కార్లతో పోటీ పడుతోంది. దీని టాప్ మోడల్ ధర రూ. 13.62 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది.
టాటా కర్వ్ ధర సెప్టెంబర్ 2న ప్రకటించబడుతుండగా, ముఖ్యంగా టాప్-స్పెక్ డీజిల్ ఎటివేరియంట్ ధర రూ. 15-20 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఇంకా పోటీ విషయానికి వస్తే, టాటా కర్వ్ మోడల్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజిఆస్టర్, హోండా ఎలివేట్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ మరియు స్కోడా కుషాక్ వంటి కార్లతో పోటీపడుతుంది.
ఫైనల్ రిపోర్ట్: ఈ కూపే ఎస్‍యూవీలలో ఏది కింగ్ గా నిలుస్తుంది ?
టాటా కర్వ్ మరియు సిట్రోన్ బసాల్ట్ కార్లు రెండూ కూపే ఎస్‍యూవీసెగ్మెంట్‌లో బలమైన పోటీదారులుగా ఉన్నాయి. టాటా కర్వ్ ఫీచర్లు మరియు ఇంజన్ ఎంపికలలో ముందంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది, అయితే సిట్రోన్ బసాల్ట్ దాని చవక ధర మరియు ఫ్రెంచ్ స్టైలింగ్‌తో అద్బుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఈ రెండు ఎస్‌యూవీలలో ఏది కస్టమర్ల హృదయాలను గెలుచుకుంటుందో వేచి చూడాలి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్