టాటా మోటార్స్ కర్వ్ కూపే ఎస్‌యువిని దానికి తగ్గ ధరతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అన్నింటి కంటే ముఖ్యంగా, కర్వ్ ఈవీని రూ.17.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ప్రారంభం) ధరతో లాంచ్ చేసి ఆటోమేకర్ మన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు, స్వదేశీ కార్ మేకర్ ఐసీఈ కర్వ్ ని రూ.10 లక్షల ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చి కాంపీటీషన్ కి తెర తీసింది.
టాటా కర్వ్, స్మార్ట్, ప్యూర్+, ప్యూర్+ S, క్రియేటివ్, క్రియేటివ్ S, క్రియేటివ్+ S, అకాంప్లిష్డ్ S, మరియు అకాంప్లిష్డ్+ A అనే 8 వేరియంట్లలో అందించబడుతోంది, కర్వ్ఎస్‌యువిలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2- 1.2-లీటర్ టిజిడిఐ హైపీరియన్ (కొత్తది), మరియు 1.5 లీటర్ క్రియోజెట్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే, గేర్‌బాక్స్ ఆప్షన్స్ విషయానికొస్తే, అన్ని ఇంజిన్స్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి వచ్చాయి.
వేరియంట్ వారీగా కొత్త టాటా కర్వ్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి
వేరియంట్స్ | 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ | 1.2-లీటర్ టిజిడిఐ హైపీరియన్ | 1.5- లీటర్ క్రయోజెట్ |
స్మార్ట్ | రూ.10 లక్షలు | - | రూ.11.5 లక్షలు |
ప్యూర్+ | రూ.11 లక్షలు | - | రూ.12.5 లక్షలు |
క్రియేటివ్ | రూ.12.2 లక్షలు | - | రూ.13.7 లక్షలు |
క్రియేటివ్ S | రూ. 12.7 లక్షలు | రూ.14 లక్షలు | రూ.14.2 లక్షలు |
క్రియేటివ్+ S | రూ.13.7 లక్షలు | రూ.15 లక్షలు | రూ.15.2 లక్షలు |
అకాంప్లిష్డ్ S | రూ.14.7 లక్షలు | రూ.16 లక్షలు | రూ.16.2 లక్షలు |
అకాంప్లిష్డ్+ A | - | రూ.17.5 లక్షలు | రూ.17.7 లక్షలు |
ధర అంచనా ప్రకారం, ఈ బ్రాండ్ అత్యంత పాపులర్మోడల్ అయిననెక్సాన్ లో, ప్రస్తుతం రూ. 8 లక్షలప్రారంభ ధరతో పెట్రోల్ వెర్షన్ మరియు రూ. 10 లక్షల ప్రారంభ ధరతో డీజిల్ వెర్షన్‌లు విక్రయించబడుతున్నాయి. కొత్త కర్వ్ తో పోలిస్తే, నెక్సాన్ లోని బేస్ వేరియంట్లు పెట్రోల్ వెర్షన్ రూ. 2 లక్షలు తక్కువ ధరతో మరియు డీజిల్ వెర్షన్ రూ.1.5 లక్షలు తక్కువ ధరతో లభిస్తాయి
కాబట్టి, రూ 2 లక్షల ఎక్కువ ధరతో వచ్చిన టాటా కర్వ్ నెక్సాన్ కంటే ఎక్కువగా ఏయే ఫీచర్లను అందిస్తుంది?
ముందుగా కర్వ్ గురించి చెప్పాలంటే , కర్వ్ అనేదిమిడ్-సైజ్ ఎస్‌యువి వంటి కార్లకు పోటీగా ఉంటుంది. అలాగే, టాటా నెక్సాన్‌తో పోల్చినప్పుడు అన్ని రేంజ్ లో కర్వ్ పెద్దది అని చెప్పవచ్చు. అలాగే, కర్వ్ బూట్‌స్పేస్ రెండోదాని కంటే చాలా పెద్దది.
కొలతలు | టాటా కర్వ్ | టాటా నెక్సాన్ |
పొడవు | 4,308ఎంఎం | 3,995 ఎంఎం |
ఎత్తు | 1,630 ఎంఎం | 1,620 ఎంఎం |
వెడల్పు | 1,810 ఎంఎం | 1,804 ఎంఎం |
వీల్ బేస్ | 2,560 ఎంఎం | 2,498 ఎంఎం |
బూట్ స్పేస్ | 500 లీటర్లు | 382 లీటర్లు |
టాటా కర్వ్ (ఎక్స్-షోరూమ్) ధరలు | టాటా నెక్సాన్(ఎక్స్-షోరూమ్)ధరలు | ||
స్మార్ట్ పెట్రోల్ | రూ. 10 లక్షలు | స్మార్ట్ (O) పెట్రోల్ | రూ. 8 లక్షలు |
స్మార్ట్ డీజిల్ | రూ. 11.49 లక్షలు | స్మార్ట్ ప్లస్ డీజిల్ | రూ. 10 లక్షలు |
ఇప్పుడు బేస్ వేరియంట్‌ల వారీగా టాటా కర్వ్ మరియు నెక్సాన్ ఫీచర్ల మధ్య తేడాలు పోల్చి చూద్దాం.
ఫీచర్స్ | టాటా కర్వ్ స్మార్ట్ పెట్రోల్ | టాటా నెక్సన్ స్మార్ట్ (O) పెట్రోల్ |
ఎయిర్‌బ్యాగ్స్ | 6 | 6 |
ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ | ఉంది | ఉంది |
ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ | లేదు | లేదు |
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ | 4-ఇంచ్ | లేదు |
టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ | ఉంది | ఉంది |
పవర్ విండోస్ | అన్నీ | ముందు మాత్రమే |
హిల్ హోల్డ్ కంట్రోల్ | ఉంది | ఉంది |
ఐసోఫిక్స్ | ఉంది | ఉంది |
రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ | ఉంది | ఉంది |
ఈఎస్పీ | ఉంది | ఉంది |
సెంట్రల్ లాక్ | ఉంది | ఉంది |
అనువాదించిన వారు: రాజపుష్ప