- ప్రస్తుతం 4 వెర్షన్లలో అందిచబడుతున్న మోడల్
- రూ. 9.99 లక్షలతో ధరలు ప్రారంభం
చాలా సంవత్సరాలుగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో క్రెటా ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండగా, దానికి దీటుగా ఇండియన్ ఆటో మేకర్ టాటా కర్వ్ ని లాంచ్ చేసిఉనికిని చాటుకుంది. టాటా నుండి ఈ కొత్త కూపే ఎస్‌యూవీ రూ. 9.99 లక్షల ప్రారంభ ధరతో మరియు స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు అకాంప్లిష్డ్ అనే 4 వెర్షన్‌లలో అందుబాటులో ఉంది.
కార్ల డిజైన్ మరియు ఫీచర్లలో తేడాలు మినహా, టాటా మోటార్స్ వేరియంట్‌ల మధ్య తేడాను గుర్తించడానికి ఆసక్తికరమైన విషయాలను కలిగి ఉంది. అలాగే, ఇది కొత్త నెక్సాన్ లాంచ్‌తో ప్రతి వెర్షన్ లేదా ఒక దానికి థీమ్‌ని అందించడం ద్వారా ఇది ప్రారంభమైంది. ఇప్పుడు, కర్వ్ కూడా వేరియంట్ ని బట్టి వివిధ ఇంటీరియర్ థీమ్ ఆప్షన్స్ ను పొందింది.
టాటా కర్వ్ స్మార్ట్:
కూపే ఎస్‌యూవీ ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ను స్మార్ట్ వేరియంట్ అని అంటారు. ఈ వేరియంట్ బేసిక్ ఫీచర్లతో మరియు బ్లాక్ మరియు వైట్ కలర్ తో గ్రే ఫ్యాబ్రిక్ సీట్ అప్హోల్స్టరీతో వస్తుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇందులో ఎక్కువ ఫీచర్లు లేనప్పటికీ, కర్వ్ స్మార్ట్ వేరియంట్ అన్ని వెర్షన్‌ల వలె ఫోర్-స్పోక్ స్టీరింగ్‌ను కాకుండా టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను పొందుతుంది.
టాటా కర్వ్ ప్యూర్:
కర్వ్ ఎస్‌యూవీ ప్యూర్ వేరియంట్ ఫాబ్రిక్ సీట్లతో సమానమైన బ్లాక్ మరియు వైట్ థీమ్‌ను పొందుతున్నప్పటికీ, స్టీరింగ్ వీల్ స్మార్ట్ వేరియంట్ వలె కాకుండా డ్యూయల్-టోన్ వైట్ ఫినిషింగ్‌ను కూడా పొందింది.
టాటా కర్వ్ క్రియేటివ్:
కర్వ్ క్రియేటివ్ వేరియంట్‌లో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, టచ్ ఆధారిత హెచ్ వీఏసీ ప్యానెల్, యాంబియంట్ లైటింగ్ వంటి మరిన్ని అనేక ఫీచర్లు ఉన్నాయి. థీమ్ విషయానికొస్తే, ఈ వెర్షన్ వివిధ చోట్ల సిల్వర్ తో బ్లాక్ మరియు బ్లూ కలర్ తో వచ్చింది. అంతేకాకుండా, అప్హోల్స్టరీ కూడా బ్లూ థీమ్‌లో పూర్తి చేయబడింది.
టాటా కర్వ్ అకాంప్లిష్డ్:
అకాంప్లిష్డ్ ఫీచర్‌ల విషయానికి వస్తే, ఇది టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ అయినందున, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్(ఎడాస్) సూట్, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్ మరియు పవర్‌తో కూడిన టెయిల్‌గేట్ వంటి కొన్ని ఫీచర్లు మరియు అంశాలను పొందింది. అంతేకాకుండా, అకాంప్లిష్డ్ వేరియంట్ లోపలి భాగం బ్లాక్ మరియు బర్గుండి థీమ్ తో మరింత ఆకర్షణీయంగా ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప