- ఇండియాలో ఆగస్టు 7న కర్వ్ ధరలు వెల్లడి
- ప్రస్తుతం కొనసాగుతున్న కర్వ్ అనధికారిక బుకింగ్స్
టాటా మోటార్స్ జూలై 19న కర్వ్ ప్రొడక్షన్-రెడీ ఇటరేషన్ కి తెర దించి ఇండియాలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది లాంచ్ తర్వాత జరగనుండగా, 2024ఆగస్టు 7వ తేదీన కూపే-ఎస్‍యూవీ ధరలను ప్రకటించనుంది.
మాకు అందిన రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం కొత్త కర్వ్ అనధికారిక బుకింగ్స్ రూ. 21,000 టోకెన్ మొత్తంతో కొనసాగుతున్నాయి. ఇంకా, టాటా కంపెనీ ముందుగా కర్వ్ ఈవీ వెర్షన్ మొదట లాంచ్ చేయనుండగా, దానితరువాత ఐసీఈవెర్షన్‌ను లాంచ్ చేయనుంది. ఇంకా, భవిష్యత్తులో అన్ని కార్ల లాంచ్ లకు టాటా కంపెనీ ఈవీ-ఫస్ట్ అనే స్ట్రాటజీని ఫాలో అవ్వనుంది.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్ల పరంగా, కర్వ్ మోడల్1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్డీజిల్ మరియు 56kWh రేంజ్ వరకు ఉండే వరకు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుందని అంచనా వేస్తున్నాం. చివరిగా పేర్కొనబడిన 56kWh బ్యాటరీ ప్యాక్ ని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ అందించే అవకాశం ఉందని భావిస్తున్నాం.
ముందుగా కర్వ్ కారులో అందించబడే ఫీచర్ల గురించి చెప్పాలంటే, 2024 టాటా కర్వ్ ఈవీ మరియు ఐసీఈ వెర్షన్ కార్లు ఆల్-ఎల్ఈడీ లైటింగ్, ఫ్రంట్ మరియు రియర్ ఎల్ఈడీ లైట్ బార్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ మరియు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి బెస్ట్ ఫీచర్లతో రానున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్