- వివిధ ఇంటీరియర్ కలర్స్ స్కీమ్‌లతో రానున్న మోడల్
- సెప్టెంబర్ 2వ తేదీన ధరల ప్రకటన
టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ రేంజ్ ని విస్తరిస్తూ జోరుగా ముందుకు సాగుతోంది. ఇటీవల, ఈ బ్రాండ్ కర్వ్ ఈవీ ధరలను ప్రకటించింది. అదేవిధంగా, ఇంజిన్-ఆధారంగా కర్వ్ సెప్టెంబర్ 2వ తేదీన ధరలను ప్రకటించనుంది. ధరలు మినహాయించి, అప్ కమింగ్ (రాబోయే)టాటా కర్వ్ వేరియంట్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు మరియు కలర్ ఆప్షన్ల వివరాలను కూడా మేము ఇప్పటికే తెలుసుకున్నాము.
టాటా కర్వ్ లాంచ్ సమయానికి, గోల్డ్ ఎసెన్స్, ఫ్లేమ్ రెడ్, ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే, డేటోనా గ్రే మరియు ఒపెరా బ్లూ వంటి 6 ఎక్స్‌టీరియర్ పెయింట్ కలర్స్ లో అందించబడుతుంది. సెలెక్ట్చేసిన వేరియంట్‌లు కూడా ఎంచుకున్న డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ తో అందించబడతాయి. అదేవిధంగా, ఈ బ్రాండ్, లాంచ్ అయిన వెంటనే కర్వ్ డార్క్ ఎడిషన్‌ను కూడా పరిచయం చేస్తుందనే విషయాన్ని మేము తెలుసుకున్నాం.
అంతేకాకుండా, ఒకరు ఎంచుకున్న వేరియంట్ లేదా వివిధ రకాలను బట్టి, ఇంటీరియర్ థీమ్ మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, అకాంప్లిష్డ్ వేరియంట్స్ లోపలి భాగాలలో బర్గుండి-కలర్ ను కలిగి ఉంటాయి.
ఫీచర్ల విషయానికొస్తే, కర్వ్ మూడ్ లైటింగ్‌తో కూడిన పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, జెస్చర్ కంట్రోల్ తో పవర్డ్ టెయిల్‌గేట్, ఇల్యూమినేషన్‌తో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 4-స్పోక్‌లతోస్టీరింగ్ వీల్, టచ్-ఆధారిత హెచ్ విఎసి ప్యానెల్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సీట్స్ కోసం రెండు-స్టెప్ రిక్లైన్ ఫంక్షన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ , పవర్డ్ డ్రైవర్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా మరియు లెవల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ వంటి ఫీచర్లతో రానుంది.
మెకానికల్‍గా, కర్వ్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ టిజిడిఐ హైపీరియన్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ క్రియోజెట్ డీజిల్ ఇంజిన్ అనే మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ అన్ని ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప