- అందుబాటులో కి రానున్న ఐసీఈ మరియు ఈవీ వెర్షన్స్
- వేరియంట్‌ల వారీగా ప్రకటించబడనున్న ధరలు
టాటా మోటార్స్ కర్వ్ కూపే ఎస్‌యూవీని రేపు (అనగా)07వ తేదీ ఆగస్టు 2024 లోఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. కర్వ్ మోడల్ ఐసీఈ మరియు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో లభించనుండగా, రేపు లాంచ్ సమయంలో వేరియంట్ వారీగా కర్వ్ ధరలను కార్‌మేకర్ ప్రకటించనుంది.
టాటా కర్వ్ నెక్సాన్ కంటే ఎక్కువ ఫీచర్లతో వస్తుండగా, కూపే లాంటి బాడీ స్టైల్‌ను కలిగి ఉంటుంది. ఇది ఎల్ఈడీ లైట్ బార్, అమర్చిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్‌పై రైడ్‌లను పొందుతుంది. ఇతర ఇంటీరియర్ హైలైట్స్ లో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ మరియు వెనుక భాగంలో అమర్చబడిన ఎల్ఈడీ లైట్ బార్ వంటివి ఉన్నాయి.
ఈ కార్ క్యాబిన్ లోపల, కొత్త కూపేలో ఇల్యూమినేటెడ్ టాటా లోగో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్‌తో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ను పొందుతుంది. ఇతర ఫీచర్లు చూస్తే, ఇందులోని ఫీచర్లు నెక్సాన్ నుండి (క్యారీ చేయబడతాయి)తీసుకున్నవి అనే చెప్పవచ్చు. అంతేకాకుండా, కూపే ఎస్‌యువి ఇతర సేఫ్టీ ఫీచర్స్ సిస్టమ్ తో పాటు ఏడీఏఎస్ (ఎడాస్)ని కలిగి ఉండే అవకాశం ఉంది.
పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
ఐసీఈ కర్వ్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల ఆప్షన్లతో అందించబడుతుంది. మరోవైపు, ఎలక్ట్రిక్ వెర్షన్ బ్రాండ్ Acti.ev ప్లాట్ ఫారం ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు టాప్-స్పెక్ వెర్షన్ 55kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండగా, ఇది ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 600కిలోమీటర్ల క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప