- చవకైన కూపే-ఎస్‍యూవీ సెగ్మెంట్లో మొదటి మోడల్ గా వస్తున్న కర్వ్ కారు
- ఈవీ మరియు ఐసీఈ వెర్షన్లలో అందించబడనున్న కొత్త మోడల్
ఇండియన్ మార్కెట్లో కొత్త కర్వ్ కూపే ఎస్‍యూవీ లాంచ్ తేదీని టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించింది. కార్ మేకర్ ఈ సెగ్మెంట్లో మొదటి కారును పరిచయం చేస్తుండగా, ఇది ఈవీ మరియు ఐసీఈ పవర్ ట్రెయిన్లలో అందించబడనుంది. అయినప్పటికీ, ఈ రెండు వెర్షన్ల ధరలు ఇప్పటివరకు తెలియరాలేదు, లాంచ్ తేదీనే వీటి ధరలు ప్రకటించే అవకాశం ఉంది.
లేటెస్టుగా టాటా మోటార్స్ షేర్ చేసిన సెట్ టీజర్ వీడియోలలో కర్వ్ ఈవీ మరియు ఐసీఈ వెర్షన్లలోని అందించబడే కీలక ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. ఎక్స్‌టీరియర్ పరంగా, బయటి వైపు ఈమోడల్‌లో నెక్సాన్ రేంజ్ ని గుర్తుకు తెచ్చే విధంగా ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డ్యూయల్ పాడ్ వర్టికల్ గా అమర్చబడిన ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, ఫ్రెష్ అల్లాయ్ వీల్స్ సెట్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, స్లోపింగ్ రూఫ్‌లైన్ మరియు ర్యాప్‌రౌండ్ ఇన్‌వర్టెడ్ ఎల్- షేప్డ్ ఎల్ఈడీటెయిల్‌లైట్స్ ఉంటాయి. రియర్ ప్రొఫైల్ లో కూడా ఎల్ఈడీ లైట్ బార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఇంటీరియర్ పరంగా, టాటా కర్వ్లోపల సన్‌రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, డ్రైవ్ మోడ్స్ మరియు టూ-స్పోక్ స్టీరింగ్ వీల్స్ ఉండనున్నాయి.
బానెట్ కింద, కర్వ్ కారులోని 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో జతచేయబడి రానున్నాయి. టాటా బ్రాండ్ ఈవీ వెర్షన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరాలను వెల్లడించలేదు. కానీ, కర్వ్ ఈవీ కారును ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించగలదని మేము భావిస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్