- ఈ ఏడాది చివరలో ఇండియాలో లాంచ్ కానున్న టాటా కర్వ్
- ఐసీఈ మరియు ఈవీ వెర్షన్లలో అందించబడే అవకాశం
టాటా మోటార్స్ రానున్న కొన్ని నెలల్లో అన్ని కార్ల లాంచ్ ద్వారా దాని క్యాలెండర్ ఫుల్ అయిపోయింది. అందులో భాగంగా కొత్త మోడళ్లను మరియు ఆయా సెగ్మెంట్లలో వేరియంట్లను పరిచయం చేయనుంది. వచ్చే నెలలో లాంచ్ అయ్యే టాటా ఆల్ట్రోజ్ రేసర్ కోసం మనందరం ఎదురుచూస్తుండగా, ఇప్పుడు లేటెస్ట్ గా కర్వ్ కొత్త స్పై షాట్స్ లీకవడంతో కర్వ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిశాయి. అవేంటో మనం ఈ ఆర్టికల్ ద్వారా పరిశీలిద్దాం.
ఇక్కడ కనిపిస్తున్న టెస్ట్ మ్యూల్ ని పరిశీలిస్తే, టాటా కర్వ్ యొక్క రియర్ ప్రొఫైల్ కి సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. టాటా కర్వ్ ఇన్వర్టెడ్ టూ-పీస్ ఎల్-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, బూట్ లిడ్ పై అదనపు బ్రేక్ లైట్, మరియు బంపర్ యొక్క ఏదో ఒకవైపు సెపరేట్ వర్టికల్ హౌసింగ్ అందించగా, అవి రివర్స్ లైట్స్ మరియు ఫాగ్ లైట్స్ పై ఉంటాయి.
అంతే కాకుండా, 2024 టాటా కర్వ్ షార్క్-ఫిన్ యాంటెన్నా, అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎ-పిల్లర్-మౌంటెడ్ ఓఆర్‍విఎం మరియు రియర్ బంపర్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ హోల్డర్ వంటి వాటిని పొందనుంది. ఫీచర్ల పరంగా, ఈ కారు 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లేలు, డ్రైవ్ మోడ్స్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి బెస్ట్ ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది.
బానెట్ కింద, కొత్త టాటా కర్వ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుండగా, ఇది 118bhp మరియు 260Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లతో జతచేయబడుతుంది. కర్వ్ ఈవీ వెర్షన్ వస్తున్నట్లు ఇది వరకే నిర్దారణ కాగా, ఇది ఐసీఈ వెర్షన్ల కంటే ముందుగా రానుంది. అదే విధంగా కర్వ్ సిఎన్‍జి వెర్షన్ పై కూడా టాటా వర్క్ చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్