- ఈవీ మరియు ఐసీఈ వెర్షన్లలో కనిపించిన టాటా కర్వ్ మోడల్
- ఆగస్టు 7వ తేదీన టాటా కర్వ్ ఈవీ ధరలు వెల్లడి
టాటా మోటార్స్ ఈ నెల చివరి నాటికి కర్వ్ నుంచి రెండు వెర్షన్లను పరిచయం చేయడానికి అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. అందులో కర్వ్ నుంచి వస్తున్న ఈవీ మరియు ఐసీఈ వెర్షను ఉన్నాయి. ఆగస్టు 7వ తేదీన ఈవీ డెరివేటివ్ ధర వెల్లడి కానుండగా, దాని కంటే ముందుగా ఐసీఈ వెర్షన్ తో కలిపి టివిసి షూట్ వద్ద కనిపించింది.
ఇక్కడ ఫోటోలలో చూసిన విధంగా, కర్వ్ ఐసీఈ మరియు ఈవీ వెర్షన్లు సిగ్నేచర్ గోల్డ్ ఎసెన్స్ మరియు వర్చువల్ సన్ రైజ్ కలర్లలో కనిపించాయి. ఇందులోని ముఖ్యమైన డిజైన్ అంశాలలో స్లోపింగ్ రూఫ్ లైన్, ఇన్వర్టెడ్ ఎల్-షేప్డ్ టెయిల్ లైట్స్, కారు ముందు మరియు వెనుక భాగాల్లో కనెక్టెడ్ టెయిల్ లైట్ సెటప్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్ట్-కలర్డ్ స్కిడ్ ప్లేట్స్, మరియు హెడ్ లైట్ క్లస్టర్ కోసం ట్రయాంగిల్ షేప్ లో హౌజింగ్ వంటివి ఉన్నాయి.
ఇతర ముఖ్యమైన అంశాలను గమనిస్తే, టాటా కర్వ్ ఈవీ మరియు ఐసీఈ వెర్షన్లలో బ్లాక్డ్-అవుట్ ఓఆర్‌విఎంస్, షార్క్ ఫిన్ యాంటెన్నా, పనోరమిక్ సన్ రూఫ్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, బ్లాక్ బి-పిల్లర్స్, మరియు చుట్టూ అంతటా బ్లాక్ క్లాడింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా నుంచి వస్తున్న కర్వ్ ఈవీ మరియు ఐసీఈ వెర్షన్లు సిట్రోన్ బసాల్ట్ తో మాత్రమే కాకుండా, హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్, ఎంజి ఆస్టర్, మరియు వాటి ఎలక్ట్రిక్ కార్లతో పోటీపడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్