- మొదటగా ఈవీ రూపంలో రానున్న టాటా కర్వ్
- సిట్రోన్ బసాల్ట్ కి పోటీగా ఉండనున్న టాటా కర్వ్ ఈవీ
అప్ కమింగ్ (రాబోయే) టాటా కర్వ్ లాంచ్ సమయం దగ్గర పడుతుండగా, ప్రతి కొత్త స్పై షాట్ ద్వారా కూపే-ఎస్‌యువికి సంబంధించి సరికొత్త వివరాలు వెల్లడయ్యాయి. అలాగే, స్వదేశీ ఆటోమేకర్ ఈవీని పరిచయం చేయనుంది, దాని తర్వాత ఐసిఇ వెర్షన్‌లను పరిచయం చేయడానికి కూడా సిద్ధమవుతుంది మరియు దాని అప్ కమింగ్ (రాబోయే) అన్ని కార్లలో ఇది ఒకే విధంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
టాటా కర్వ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ని పొందుతుందని నిర్ధారించబడింది. ఇది పనోరమిక్ యూనిట్‌గా ఉండనుంది, అయినప్పటికీ ఇది సైజ్ పరిమాణంలో ఉన్న యూనిట్ కంటే తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు మరియు ఇది వెహికల్ వాలుగా ఉన్న రూఫ్‌లైన్ వరకు విస్తరించి ఉండవచ్చు.
బయటి భాగంలో, కర్వ్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, టెయిల్‌గేట్‌పై ఎల్ఈడీ లైట్ బార్ మరియు మరిన్నింటిని పొందే అవకాశం ఉంది. అలాగే, సిట్రోన్ C3 బసాల్ట్ కి -పోటీగా ఉండనున్న, కర్వ్ ఇంటీరియర్స్‌లో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఏసీ ఫంక్షన్‌ల లో టచ్ బటన్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
హుడ్ కింద, టాటా కర్వ్ ఐసిఇ మరియు ఈవీ పవర్‌ట్రెయిన్ లతో అందించబడుతుంది. ఫాసిల్-ఫ్యూయల్- వెర్షన్‌లలో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-డీజిల్ ఇంజిన్‌లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో జతచేయబడతాయి. అలాగే, ఈఎలక్ట్రిక్ డెరివేటివ్ దాని బ్యాటరీ ప్యాక్ మరియు మోటారును నెక్సాన్ ఈవీ నుండి పొందుతుందని మేము భావిస్తున్నాము.
అనువాదించిన వారు: రాజపుష్ప