- బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఫీచర్ ని పొందనున్న కర్వ్
- ఈవీ మరియు ఐసిఇ రెండింట్లో లభించనున్న మోడల్
టాటా మోటార్స్ తన రాబోయే ప్రోడక్ట్ కర్వ్ లో భారీ మార్పులు చేస్తోంది. ఈ కొత్త కూపే ఎస్‍యూవీ డిజైన్ మరియు రోడ్ ప్రెజెన్స్ విషయానికి వస్తే చూపరులను తలతిప్పుకునేలా ఉంటుంది. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, ఆటోమేకర్ ఈ రాబోయే (అప్‍కమింగ్) కూపేని పూర్తిగా టెక్ మరియు అప్‌డేట్ ఫీచర్లతో లాంచ్ చేస్తుంది.
ఇటీవల, ఈ మోడల్ నెక్సాన్ పక్కన టెస్ట్ రన్‌లో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. నెక్సాన్ ఒక ప్రీ-ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ అయినప్పటికీ, ఇది టాటా కర్వ్ సైజ్, డైమెన్షన్ మరియు రోడ్ పై కార్ ని చూస్తే, నెక్సాన్ లాగానే ఉంటుంది. నెక్సాన్‌తో పోలిస్తే లాంచ్ కానున్న ఈ కూపే మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది. అలాగే, దీని లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
టాటా కర్వ్ డిజైన్ హైలైట్‌లలో పూర్తి-వెడల్పు లైట్ బార్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన గ్రిల్ మరియు బంపర్, స్లోపింగ్ రూఫ్‌లైన్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా ఉన్నాయి. ముఖ్యంగా, వెనుకవైపురిఫ్లెక్టర్ డిజైన్, మరియు పొజిషనింగ్ కొత్త నెక్సాన్ మాదిరిగానే ఉన్నాయి.
మరిన్నిస్పై చిత్రాలలో చూస్తే, హారియర్ మరియు సఫారిలో అందుబాటులో ఉన్న బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఫీచర్ ఇందులో జతచేసి ఉంది. ఈ ఫీచర్ పూర్తి ఏడీఏఎస్ సూట్‌తో పని చేస్తుంది. ఇందులోని ఫీచర్ల విషయానికొస్తే, ఇటీవలి స్పై చిత్రాలు ఇంటీరియర్ కర్వ్ లో క్యాబిన్ వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇది ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్-బేస్డ్ హెచ్ విఎసి కంట్రోల్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం మరియు డ్యాష్‌బోర్డ్‌లో పర్పుల్ యాక్సెంట్‌లను (నెక్సాన్ మాదిరిగానే) కలిగి ఉంటుంది.
కర్వ్ ఈవీ వెర్షన్ మొదట ఐసిఇ ఇటరేషన్ తర్వాత ఆవిష్కరించబడుతుంది. రెండోది 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి వచ్చే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత, కర్వ్ దాని ఐసిఇ మరియు ఈవీ రూపంలో వరుసగా సిట్రోన్ బసాల్ట్ మరియు మహీంద్రా XUV.e9 లకు పోటీగా ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప